- Telugu News Photo Gallery Travel Going Goa For The First Time Know These Things In Details Telugu Lifestyle News
గోవా వెల్దామనుకుంటున్నారా..? ఇదే ఫస్ట్ టైమ్ అయితే,..ఈ విషయాలు ముందుగానే తెలుసుకోండి..!
గోవా చిన్న రాష్ట్రమే అయినప్పటికీ పర్యాటకానికి మాత్రం చాలా పెద్ద రాష్ట్రం. ఇక్కడికి విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. గోవా బీచ్‌లు, చర్చిలు, క్యాసినోలు, రిసార్ట్ టూరిజం పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. లవర్స్, హనీమూన్ జంటలకు గోవా బాగా నచ్చుతుంది. గోవాలో మీరు అరబ్, పోర్చుగీస్, ఫ్రెంచ్, బ్రెజిలియన్, ఆఫ్రికన్, చైనీస్, కొంకణ్, మలబార్ వంటి అన్ని రకాల ఆహార పదార్థాలను రుచి చూస్తారు. ఇక్కడ లభించే సీ ఫుడ్ ఐటమ్స్ అద్భుతమైనవి.
Updated on: Mar 06, 2024 | 7:47 AM

గోవా ఎంతో అందంగా ఉంటుంది. ఒక్కసారి వెళ్లిన వారికి మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లాలని అనిపిస్తుంది. అందుకే దేశంలోని అత్యధిక మంది ఇష్టపడే ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా గోవా నిలుస్తుంది. మీరు గతంలో ఎప్పుడూ గోవాకు వెళ్లకపోతే, ఈ హాలీడేస్‌లో గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే, మీరు గోవాను దగ్గరగా చూడాలనుకుంటే..అక్కడ బైక్‌పై ట్రావెల్ చేయటం కంటే మెరుగైన ప్రయాణం మరొకటి ఉండదు. ఇక్కడ మీకు అద్దెకు టూవీలర్లు అందుబాటులో ఉంటాయి. దాంతో మీకు టాక్సీల కోసం వెచ్చించాల్సిన డబ్బు ఆదా చేసుకోవచ్చు. గోవాను దగ్గరగా చూసే అవకాశం కూడా లభిస్తుంది.

ఇక్కడ మీరు జెట్ స్కీయింగ్, స్కూబా డైవింగ్, విండ్‌సర్ఫింగ్, కయాకింగ్, పారాసైలింగ్ ఆస్వాదించే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఈ సాహస క్రీడలన్నింటిలో మీరు చాలా సరదాగా ఉంటారు. వాటిని మళ్లీ మళ్లీ చేయాలని ఆరాటపడతారు.

ఇక మీరు గోవాలో ఎన్నో అరుదైన సముద్ర జీవులను చూస్తారు. వాగేటర్, కాండోలిమ్, కలంగుటే, బాగా వంటి ప్రధాన బీచ్‌లను సందర్శించేటప్పుడు, రద్దీ తక్కువగా ఉండే బీచ్‌లకు వెళ్లకూడదు. మీరు మరింత ఆనందించగలిగే బీచ్‌కి వెళ్లండి. ఇందులో బటర్‌ఫ్లై బీచ్, కకోలెం బీచ్, మోబార్ బీచ్ ఉన్నాయి. గోవాలో బోండ్లా నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడ పులులు, ఏనుగుల, ఎలుగుబంట్ల నుంచి వివిధ రకాల వన్యప్రానులను చూడొచ్చు. సఫారీలో ప్రయాణించవచ్చు. ఇంకా ఎన్నో రకాల అరుదైన పక్షులు, సరిసృపాలు, పూలతోటలు, వృక్షజాతులను చూడవచ్చు.

అయితే, గోవాలో బీచ్‌లు మాత్రమే కాకుండా కోటలు కూడా ఉన్నాయి. అక్కడ ఇంకా ఎన్నో ఇతర చూడదగ్గ ప్రదేశాలు, పురాతన కాలం నాటి శివాలయాలు, అడవులు -జలపాతాలు, అడ్వెంచర్ల కోసం ఎన్నో రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు చరిత్ర ప్రేమికులైతే, మీరు ఖచ్చితంగా ఇక్కడ సందర్శించాలి. ఇక్కడి కోటల నుండి సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. ఛపోరా ఫోర్ట్, అగోడా ఫోర్ట్, రైస్ మాగోస్ ఫోర్ట్ సాయంత్రాలు చాలా అందంగా ఉంటాయి.

గోవాలో మీరు అరబ్, పోర్చుగీస్, ఫ్రెంచ్, బ్రెజిలియన్, ఆఫ్రికన్, చైనీస్, కొంకణ్, మలబార్ వంటి అన్ని రకాల ఆహార పదార్థాలను రుచి చూస్తారు. ఇక్కడ లభించే సీ ఫుడ్ ఐటమ్స్ అద్భుతమైనవి. మీరు నాన్ వెజిటేరియన్ అయితే, మీరు తప్పనిసరిగా గాన్ ఫిష్ కర్రీ, బేబింకా ట్రై చేయండి.

మీరు కూడా సరదాగా చేపలు పట్టాలనే ఇష్టం, అభిరుచి ఉంటే మోబోర్, కేవెలోసిమ్ అనే ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి మంచినీటిలో సముద్రపు చేపల వేట మరింత ప్రత్యేకం. నది నుండి సముద్రం వరకు బోటింగ్ చేసుకుంటూ చేపల వేట చేసే అవకాశం మీకు లభిస్తుంది.. మీరు పట్టిన చేపలను మీకు నచ్చిన విధంగా వండి ఇస్తారు కూడా. ఈ మార్గంలో మీకు అందమైన డాల్ఫిన్లు కూడా కనువిందు చేస్తాయి.





























