- Telugu News Photo Gallery Are you snoring a lot during sleep these problems will come, Check here is details in Telugu
Snoring Problem: నిద్రలో గురక ఎక్కువగా పెడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
చాలా మందికి నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఈ గురక వల్ల పక్కన వారికి కూడా నిద్ర సరిగా పట్టదు. అయితే గురక పెడుతునట్టు వారికి కూడా తెలీదు. ఇలా గురక పెట్టి నిద్రపోతూ ఉంటే మాత్రం.. ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గురక ఎక్కువగా పెడుతున్నారు అంటే.. వారికి శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉండొచ్చు లేదా రావచ్చొని..
Updated on: Mar 06, 2024 | 12:08 PM

Snoring Problem

గురక ఎక్కువగా పెడుతున్నారు అంటే.. వారికి శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉండొచ్చు లేదా రావచ్చొని కూడా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి.

గుండె సంబంధిత సమస్యలు ఉన్నా కూడా గురక పెడుతూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా గురక అనేది గుండె సమస్యలు రావడానికి సూచన అని కూడా అంటున్నారు. ఎందుకంటే గురక హృదయ స్పందన రేటు మారుస్తుందట.

రాత్రుళ్లు మీరు సరిగ్గా నిద్రపోక పోయినా గురక వస్తుంది. అదే విధంగా గురకలో GERD వచ్చే అవకాశం కూడా ఉంది. దీని వల్ల త్వరగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా కోపం, చిరాకు పెరిగే ఛాన్సులు ఉన్నాయి.

ఎక్కువగా గురక పెట్టే వారిలో రక్త పోటు అనేది హెచ్చతగ్గులకు గురి అవుతూ ఉంటుంది. ఇది త్వరగా కంట్రోల్‌లో ఉండదు. రక్త పోటు పెరిగితే గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి గురక సమస్య ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం బెటర్.




