Email warning: సిఎం, డిప్యూటీ సిఎంలకు బాంబు బెదిరింపు మెయిల్.. ఉలిక్కి పడ్డ ఐటీ నగరం..

2.5 మిలియన్ డాలర్లు చెల్లించకపోతే అనేక చోట్ల పేలుళ్లకు పాల్పడతామని షాహిద్ ఖాన్ 10786 అనే వ్యక్తి పేరుతో సోమవారం ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు డిప్యూటీ సిఎం శివకుమార్ మీడియాకు వెల్లడించారు. మూడు రోజుల క్రితం తాను, ముఖ్యమంత్రి ఈ ఈమెయిల్‌ను అందుకున్నామని, పోలీస్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.

Email warning: సిఎం, డిప్యూటీ సిఎంలకు బాంబు బెదిరింపు మెయిల్.. ఉలిక్కి పడ్డ ఐటీ నగరం..
Email Warning
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 06, 2024 | 10:28 AM

గత కొన్ని రోజులుగా ఐటీ నగరం బెంగళూరు అల్లకల్లోలం అవుతోంది. కొన్ని రోజుల క్రితం బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు దాడి ఘటన ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా మరోమారు బెంగళూరుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్‌లను లక్షంగా చేసుకుని ప్రభుత్వానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం మరోమారు కలవరం రేపుతోంది. ముఖ్యమంత్రికి ఈ-మెయిల్స్ ద్వారా గుర్తు తెలియని వారు బెదిరింపు మెసేజ్‌ పంపించారు. దాంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు చేపట్టారు.

బెంగళూరులోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో గత 1వ తేదీ మధ్యాహ్నం వరుసగా 2 బాంబులు పేలాయి. ఈ బాంబు ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ ఘటన యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలోనే మరోమారు దుండగులు.. బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనా స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో బాంబులు పేల్చివేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి టీకే శివకుమార్, బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్‌లకు ఈ-మెయిల్స్ ద్వారా బెదిరించారు. 2.5 మిలియన్ డాలర్లు చెల్లించకపోతే అనేక చోట్ల పేలుళ్లకు పాల్పడతామని షాహిద్ ఖాన్ 10786 అనే వ్యక్తి పేరుతో సోమవారం ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు డిప్యూటీ సిఎం శివకుమార్ మీడియాకు వెల్లడించారు. మూడు రోజుల క్రితం తాను, ముఖ్యమంత్రి ఈ ఈమెయిల్‌ను అందుకున్నామని, పోలీస్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.

ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి బాంబు బెదిరింపు లేఖ పంపిన వ్యక్తులపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు మొత్తాన్ని భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. అలాగే నగరంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, దేవాలయాలు, ప్రజలు గుమిగూడే ప్రాంతాలు ఇలా అన్ని ప్రాంతాల్లో పోలీసు శాఖ గట్టి తనిఖీలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

రెస్టారెంట్‌లో పేలుడు సంభవించింది పేలుడు పరికరం లేదా సిలిండర్ అని NI తెలిపింది. రెస్టారెంట్‌లో దుండగులు పేల్చిన బాంబు అత్యంత శక్తిమంతమైన ఐఈడీ అని బాంబు దర్యాప్తు బృందం తెలిపిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. దుండగుడు ఒక కస్టమర్‌గా లోపలికి వచ్చి బ్యాగ్‌ని అక్కడ వదిలివెళ్లినట్టుగా చెప్పారు. అదే సంచిలోంచి బాంబు పేలినట్టుగా రక్షణ బృందం నిర్ధారించింది. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..