AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాగునీటికి కటకట.. నీరు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా! ఎక్కడంటే..

Bengaluru water crisis: వేసవి ఇప్పుడే మొదలైంది.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో పూర్తిగా వేసవి మొదలుకాక ముందే బెంగళూరులో తాగునీరు కరువైంది. దీంతో జనం బిందెలు, బకెట్లు పట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు. నీటి కొరత ఉన్న నేపథ్యంలో బెంగళూరు వాసులు నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తాగునీటికి కటకట.. నీరు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా! ఎక్కడంటే..
Bengaluru Water Crisis
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2024 | 9:31 AM

Share

Bengaluru water crisis: వేసవి ఇప్పుడే మొదలైంది.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో పూర్తిగా వేసవి మొదలుకాక ముందే బెంగళూరులో తాగునీరు కరువైంది. దీంతో జనం బిందెలు, బకెట్లు పట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు. నీటి కొరత ఉన్న నేపథ్యంలో బెంగళూరు వాసులు నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బెంగుళూరులో నాలుగురోజులుగా నీటి సరఫరా లేక వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. నీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తూ పామ్ మెడోస్ సొసైటీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మున్ముందు 40 శాతానికి పెంచుతామని హెచ్చరించింది. నీరు వృథా చేస్తే 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నీటివాడకాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను సైతం నియమించింది. వీరంతా నీటి వినియోగంపై దృష్టిపెట్టనున్నారు.

కాగా, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా ఉంది. గతంలో ట్యాంకర్ నీరు రూ. 650 నుండి రూ 800కు ఇస్తున్న ట్యాంకర్ యజమానులు రెండు వారాల క్రితం రూ. 1,300 నుండి రూ 1,500 పెంచేశారు. అయితే ఇప్పుడు ఏకంగా రూ 2,000 అని చెప్పడంతో ప్రజలు షాక్ అవుతున్నారు. అంత డబ్బులు పెట్టి నీరు కొనుగోలు చెయ్యలేక సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది చివరిలో కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చెయ్యడం వలనే బెంగళూరులో తాగునీటి కష్టాలు ఎదురౌతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇదిలాఉంటే.. బెంగళూరులో తాగునీటి ఎద్దడిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు.. బెంగళూరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగిన నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎండిపోయిందంటూ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..