PM Modi: అండర్ వాటర్ మెట్రో సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఒళ్లంతా థ్రిల్లంత అయ్యే వీడియో..
మెట్రో వచ్చాక.. కాస్మాపాలిటిన్ సిటీస్‌ల లుక్కే మారింది. నగరవాసులకు జర్నీ వెరీ ఈజీగా మారింది. అల్లంత ఎత్తులో దూసుకెళ్తోన్న మెట్రో రైల్‌ను చూశాం. కానీ బెంగాల్‌లో కథ మరో లెవల్. ఒళ్లంతా థ్రిల్లంత అయ్యేలా కోలకతాలో ఇవ్వాళ్టి నుంచి అండర్ వాటర్ మెట్రో సేవలు అందుబాటులోక వచ్చేస్తున్నాయి. హుగ్లీ నదిలో నిర్మించిన టన్నల్‌లో మెట్రో రైలు బుల్లెట్ వేగంతో పరుగులు తీయనుంది.
మెట్రో వచ్చాక.. కాస్మాపాలిటిన్ సిటీస్‌ల లుక్కే మారింది. నగరవాసులకు జర్నీ వెరీ ఈజీగా మారింది. అల్లంత ఎత్తులో దూసుకెళ్తోన్న మెట్రో రైల్‌ను చూశాం. కానీ బెంగాల్‌లో కథ మరో లెవల్. ఒళ్లంతా థ్రిల్లంత అయ్యేలా కోలకతాలో ఇవ్వాళ్టి నుంచి అండర్ వాటర్ మెట్రో సేవలు అందుబాటులోక వచ్చేస్తున్నాయి. హుగ్లీ నదిలో నిర్మించిన టన్నల్‌లో మెట్రో రైలు బుల్లెట్ వేగంతో పరుగులు తీయనుంది. దాదాపు 5 కిలో మీటర్లు మెట్రో రైలు హుగ్లీ నది కింది నుంచి దూసుకెళ్తోంది. కోలకతా మెట్రో ఈ ప్రతిష్టాత్మకరమైన ప్రాజెక్ట్‌ను రన్ చేస్తోంది. నీటి ఉపరితలానికి 16 మీటర్ల లోతున మెట్రో రైళ్లు ప్రయాణిస్తాయి. 120 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీసులను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభిస్తారు. తూర్పు-పశ్చిమ మెట్రో 4.8-కిమీ విస్తరణ పనులను మొత్తం రూ.4,965 కోట్ల వ్యయంతో నిర్మించారు. గురువారం నుంచి ప్రయాణికులను అనుమతిస్తారు.
దేశంలో తొలి మెట్రో రైలు ప్రారంభమైంది కోల్‌కతాలోనే. ఇప్పుడు ఈ అద్భుతమైన అండర్ వాటర్ మెట్రో రైల్ కూడా కోల్‌కతా ఖాతాలోనే చేరడం విశేషం. కోలకతా- హౌరా మధ్య ఈ అండర్ వాటర్ మెట్రో పరుగులు తీస్తుంది. 2009లో ఈ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించారు. 2017లో టన్నెల్ నిర్మాణం పూర్తయింది. డింది – హౌరాలో భారతదేశంలోని లోతైన మెట్రో స్టేషన్‌ను కలిగి ఉంది.. భూమి స్థాయికి 30 మీటర్ల దిగువన. ఐటీ హబ్ సాల్ట్ లేక్ సెక్టార్ V వంటి కీలక ప్రాంతాలను అనుసంధానించడానికి ఈ కారిడార్ సహాయం చేస్తుంది.
వీడియో చూడండి..
#WATCH | India’s first underwater metro rail service in Kolkata set to be inaugurated by PM Modi on 6th March pic.twitter.com/ib5938Vn8x
— ANI (@ANI) March 5, 2024
పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం కోల్‌కతాలో రూ.15,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు . ఐదు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లో ఆయన పర్యటించడం ఇది రెండోసారి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..