Gurugram: రెస్టారెంట్‌కు వెళ్లిన కస్టమర్లకు భయానక అనుభవం..! భోజనం తిన్న కాసేపటికే రక్తం వాంతులు..

ఓ రెస్టారంట్‌కు స్నేహితులతో సరదాగా డిన్నర్‌ చేసేందుకు వెళ్లిన కస్టమర్లకు భయానక అనుభవం ఎదురైంది. భోజనం చేసిన తర్వాత రెస్టారెంట్‌ సిబ్బంది ఇచ్చిన మౌత్‌ ఫ్రెష్‌నర్‌ కారణంగా వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతోపాటు నోటి నుంచి రక్తం రావడంతో వారంతా ఆస్పత్రి పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షాకింగ్‌ ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో..

Gurugram: రెస్టారెంట్‌కు వెళ్లిన కస్టమర్లకు భయానక అనుభవం..! భోజనం తిన్న కాసేపటికే రక్తం వాంతులు..
Gurugram Cafe Dry Ice Incident
Follow us

|

Updated on: Mar 05, 2024 | 5:30 PM

నొయిడా, మార్చి 5: ఓ రెస్టారంట్‌కు స్నేహితులతో సరదాగా డిన్నర్‌ చేసేందుకు వెళ్లిన కస్టమర్లకు భయానక అనుభవం ఎదురైంది. భోజనం చేసిన తర్వాత రెస్టారెంట్‌ సిబ్బంది ఇచ్చిన మౌత్‌ ఫ్రెష్‌నర్‌ కారణంగా వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతోపాటు నోటి నుంచి రక్తం రావడంతో వారంతా ఆస్పత్రి పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షాకింగ్‌ ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో మంగళవారం (మార్చి 5) చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

హర్యాణాలోని నొయిడాకు చెందిన అంకిత్‌ కుమార్‌ అనే వ్యక్తి తన భార్య, నలుగురు స్నేహితులతో కలిసి సెక్టార్‌ 90లో ఉన్న ఓ కేఫ్-కమ్-రెస్టారంట్‌కు డిన్నర్‌ చేసేందుకు వెళ్లారు. అందరూ సరదాగా భోజనం కూడా చేశారు. ఇంతలో ఓ వెయిటర్‌ వచ్చి మౌత్‌ఫ్రెష్‌నర్‌ ఇచ్చాడు. దీంతో వారంతా వెయిటర్‌ ఇచ్చిన మౌత్‌ఫ్రెష్‌నర్‌ తీసుకుని నోట్లో వేసుకున్నారు. అంతే కొద్దిసేపటికే నోట్లో మంట ప్రారంభమైంది. ఆ తర్వాత వాంతులు కావడంతోపాటు వారి నోటి వెంట రక్తం కూడా వచ్చింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్‌ సిబ్బంది తమకు ఇచ్చిన మౌత్‌ ఫ్రెష్‌నర్‌లో ఏమి కలిపారో తెలియదని, దానిని తిన్న వెంటనే నోట్లో మంట, నాలుకపై గాయాలు అయ్యాయని, ఆ తర్వాత రక్తం వాంతులు అయినట్లు ఫిర్యాదులో తెలిపారు. మౌత్‌ ఫ్రెష్‌నర్‌ పేరుతో తమకు యాసిడ్‌ ఇచ్చి ఉంటారని పేర్కొన్నారు. రెస్టారెంట్‌లో ఇచ్చిన మౌత్‌ ఫ్రెషనర్‌ ప్యాకెట్‌ను ఆసుపత్రిలో వైద్యులకు చూపగా.. అది డ్రై ఐస్‌ అని చెప్పినట్లు అంకిత్‌ కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనానంతరం రెస్టారంట్‌ సిబ్బంది పరారైనట్లు వారు ఆరోపించారు.

ఈ ఘటనపై ఫుడ్ పాయిజనింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరి దర్యాప్తులో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో కూడిన పోలీస్‌ టీం రెస్టారెంటు మేనేజర్‌ గగన్‌దీప్‌ (30)ను అరెస్టు చేశారు. రెస్టారెంట్ యజమాని అమృతపాల్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఈ మేరకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. కాగా అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ