Dry Ice Health Risk: డ్రై ఐస్‌తో జర భద్రం..! నేరుగా చేతులతో తాకినా, తిన్నా ఎంత ప్రమాదమో తెలుసా?
గురుగ్రామ్‌లోని ఓ రెస్టారంట్‌కు డిన్నర్ చేసేందుకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు మౌత్ ఫ్రెష్‌నర్‌కు బదులుగా డ్రై ఐస్ తినడంతో రక్తం వాంతులతో తీవ్ర అశ్వస్తతకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది. అసలేమిటీ డ్రై ఐస్.. ఇది తింటే ఏం జరుగుతోంది? అనే విషయాలు నెటిజన్లు ఇంటర్‌నెట్‌లో వెతికేస్తున్నారు. ఆ విషయాలు మీ కోసం.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం..

గురుగ్రామ్‌లోని ఓ రెస్టారంట్‌కు డిన్నర్ చేసేందుకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు మౌత్ ఫ్రెష్‌నర్‌కు బదులుగా డ్రై ఐస్ తినడంతో రక్తం వాంతులతో తీవ్ర అశ్వస్తతకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది. అసలేమిటీ డ్రై ఐస్.. ఇది తింటే ఏం జరుగుతోంది? అనే విషయాలు నెటిజన్లు ఇంటర్‌నెట్‌లో వెతికేస్తున్నారు. ఆ విషయాలు మీ కోసం.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం.. డ్రై ఐస్ ప్రాణాంతక పదార్థం. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) కూడా ఒట్టి చేతులతో డ్రై ఐస్ తాకడం కూడా అత్యంత ప్రమాదకరమని చెబుతున్నాయి. చేతులకు ఎల్లప్పుడూ గ్లౌజులు ధరించి మాత్రమే దీనిని వినియోగించాలని పేర్కొంటున్నాయి.
అసలు.. డ్రై ఐస్ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారు?
డ్రై ఐస్ అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద, దాదాపు -78.5 డిగ్రీల సెల్సియస్ (-109.3 డిగ్రీల ఫారెన్‌హీట్) వద్ద తయారు చేసే ఘన కార్బన్ డయాక్సైడ్. డ్రై ఐస్‌ను ఫ్రీజింగ్, కూలింగ్ కోసం ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీని సబ్లిమేషన్ ప్రాపర్టీ కారణంగా ఇది ఘనపదార్థం నుంచి నేరుగా వాయువుగా మారుతుంది. అందువల్లనే ఇది సాధారణ మంచులా కాకుండా త్వరగా నీరుగా మారదు. వైద్య, ఆహార, పానీయాలు, పరిశోధన రంగాలలో దీనిని వివిధ ప్రయోజనాల కోసం వినియోగిస్తుంటారు.
డ్రై ఐస్ ఆరోగ్యానికి ప్రమాదమా?
జిందాల్ నేచర్‌క్యూర్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బబీనా NM మాట్లాడుతూ.. రెస్టారెంట్‌లు, బార్‌లలో శీతలీకరణ కోసం డ్రై ఐస్‌ను ఉపయోగిస్తుంటారు. డ్రై ఐస్ కూలింగ్ ఏజెంట్‌గా బాగా పనిచేస్తుంది. అయితే దీనిని వినియోగించేటప్పుడు కొన్ని భద్రతా చర్యలు పాటించాలి. సక్రమంగా వినియోగించకుంటే దీనిలోని కార్బన్ డయాక్సైడ్ వాయువు శ్వాస సంబంధిత సమస్యలు, చర్మ గాయాలు కలిగిస్తుంది. డ్రై ఐస్‌ను నేరుగా తకడం వల్ల చర్మంపై కాలిన గాయాలు ఏర్పడతాయి. డ్రై ఐస్‌తో ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదల చేస్తుంది. డ్రై ఐస్ సబ్లిమేట్ అయినప్పుడు అది కార్బన్ డయాక్సైడ్‌గా మారుతుంది. తగినంత వెంటిలేషన్‌లేని ప్రదేశాల్లో ఆక్సిజన్ స్థానభ్రంశం అయ్యేలా చేస్తుంది. ఆక్సిజన్ అందకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ముంబైలోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మంజుషా అగర్వాల్ వివరించారు.
పొడి మంచును ఉత్కృష్టం చేసే కార్బన్ డయాక్సైడ్ వాయువును పెద్ద మొత్తంలో పీల్చితే మైకం, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. అందుకే బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో డ్రై ఐస్‌ను గ్లౌవ్స్ ధరించిన చేతులతో లేదా పటకారులతో దానిని వినియోగించాలి. డ్రై ఐస్ ఆవిరి కంటి చికాకుకు కారణం అవుతుంది. ఇక డ్రై ఐస్‌ని తింటే ఏకంగా ప్రాణాలకే ముప్పు తలపెడుతుంది. నోరు, అన్నవాహిక, కడుపులోని కణజాలాన్ని స్తంభింపజేస్తుంది. కొంత మంది ప్రొఫెషనల్ ఎంటర్టైనర్లు వివిధ ప్రదర్శనల్లో డ్రై ఐస్ చిన్న ముక్కను నోట్లో పెట్టుకుని పొగను ఊదుతూ విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రదర్శనలు చేసేటప్పుడు పొరపాటున డ్రై ఐస్ ముక్కను మింగితే ప్రాణాలకు ముప్పు తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే.. డ్రై ఐస్ వినియోగం లేదా ఇళ్లల్లో నిల్వ చేసేటప్పుడు తగిన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.








