మీ లివర్ బాగానే ఉందా..? లేకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకం కాగలదు.. జాగ్రత్త..
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజల ఆహారం, జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. సమయాభావం వల్ల చాలా మంది అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఆరోగ్యాన్ని తమకు తాముగా దెబ్బతీసుకుంటున్నారు. ఫ్యాటీ లివర్ క్రమంగా ప్రాణాంతకం అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్ ఉన్న వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.

ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజల ఆహారం, జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. సమయాభావం వల్ల చాలా మంది అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఆరోగ్యాన్ని తమకు తాముగా దెబ్బతీసుకుంటున్నారు. ఫ్యాటీ లివర్ క్రమంగా ప్రాణాంతకం అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్ ఉన్న వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. లివర్ సమస్యల్లో.. ప్రధానంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా ఉంది. ఫ్యాటీ లివర్ సమస్యను ఆల్కాహాలిక్.. నాన్ ఆల్కహాలిక్ గా పేర్కొంటారు. మద్యం తాగితే ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది.. ఆల్కహాల్ తాగని వారిలో కనిపించే కాలేయ సమస్యను నాన్ ఆల్కహాలిక్ గా పేర్కొంటారు. కాబట్టి ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి?
ఆల్కహాల్ తాగనివారిలో కనిపించే ఫ్యాటీ లివర్‌ను ఫ్యాటీ లివర్ డిసీజ్ (లైఫ్‌స్టైల్ డిసీజ్) అంటారు. ఈ వ్యాధిలో, వ్యక్తి ఆహారం కారణంగా కాలేయంలో అదనపు కొవ్వు లేదా కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల కాలేయం దెబ్బతింటుంది.
కోలిన్ – లివర్ రిలేషన్
శరీరంలో కోలిన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కాలేయంలో కొవ్వును జీర్ణం చేయడానికి పనిచేస్తుంది. అంతేకాకుండా, ఫ్యాటీ లివర్ సమస్యకు కూడా ఇది చాలా వరకు సహాయపడుతుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడాలంటే కోలిన్ అధికంగా ఉండే ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
కోలిన్ ఈ ఆహారాలలో కనిపిస్తుంది..
గుడ్లు: గుడ్డు కోలిన్ కి మంచి వనరులు. ఈ సందర్భంలో, మీరు కూడా మీ ఆహారంలో గుడ్లను తప్పకుండా చేర్చుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను నివారించవచ్చు.
సోయాబీన్స్: అరకప్పు కాల్చిన సోయాబీన్స్‌లో 107mg కోలిన్ ఉంటుంది. ఇది మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి మీరు కూడా మీ ఆహారంలో సోయాబీన్స్‌ను చేర్చుకోండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




