AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Endometriosis: ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటో తెలుసా? అందుకే ఆ 3 రోజుల్లో భరించలేని నొప్పి వస్తుందట..

ఎండోమెట్రియోసిస్ అనేది ఈ రోజుల్లో మహిళల్లో చాలా సాధారణ సమస్యగా మారింది. దీని వల్ల చాలా మందికి పీరియడ్స్ సమయంలో తీవ్రంగా కడుపు నొప్పి వస్తుంది. దీని ఇతర లక్షణాలు ఏంటంటే.. ఒక్కోసారి ఎండోమెట్రియోసిస్ వల్ల పీరియడ్స్ లేకపోయినా కడుపునొప్పి సంభవిస్తుంది. ఇటీవలి ఆరోగ్య సర్వేల ప్రకారం.. మన దేశంలో ప్రతి సంవత్సరం సగటున 10 లక్షల మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సమస్య ప్రీ మెనోపాజ్ మహిళల్లో..

Endometriosis: ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటో తెలుసా? అందుకే ఆ 3 రోజుల్లో భరించలేని నొప్పి వస్తుందట..
Endometriosis
Srilakshmi C
|

Updated on: Mar 02, 2024 | 12:38 PM

Share

ఎండోమెట్రియోసిస్ అనేది ఈ రోజుల్లో మహిళల్లో చాలా సాధారణ సమస్యగా మారింది. దీని వల్ల చాలా మందికి పీరియడ్స్ సమయంలో తీవ్రంగా కడుపు నొప్పి వస్తుంది. దీని ఇతర లక్షణాలు ఏంటంటే.. ఒక్కోసారి ఎండోమెట్రియోసిస్ వల్ల పీరియడ్స్ లేకపోయినా కడుపునొప్పి సంభవిస్తుంది. ఇటీవలి ఆరోగ్య సర్వేల ప్రకారం.. మన దేశంలో ప్రతి సంవత్సరం సగటున 10 లక్షల మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సమస్య ప్రీ మెనోపాజ్ మహిళల్లో కూడా కనిపిస్తుందట. పీరియడ్స్‌ సమయంలో ఎండోమెట్రియం ఉబ్బినప్పుడు, ఫెలోపియన్ నాళాలు, అండాశయాలపై రక్తం గడ్డకట్టడం జరుగుతుంది.

ఈ వ్యాధి ప్రధాన లక్షణం పొత్తికడుపులో తీవ్ర నొప్పి రావడం. ఋతుస్రావం ప్రారంభమయ్యే నాలుగు రోజుల ముందు నొప్పితో కూడిన ఋతుస్రావం ప్రారంభమవుతుంది. కొందరికి అధిక రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఉంది. అనేక సందర్భాల్లో గర్భం ధరించడంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. అలాగే నడుము, పొత్తికడుపులో నొప్పి తీవ్రంగా ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రం నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఋతుస్రావం ఆగిపోతుంది. ప్రసవం తర్వాత ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు నొప్పి తిరిగి రావచ్చు. చాలా మంది మహిళలకు ఎండోమెట్రియోసిస్ నొప్పిని చికిత్స లేకుండానే నయం అవుతుంది.

ఋతు చక్రంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావంతో గర్భాశయం ఎండోమెట్రియం లేదా లోపలి పొర చిక్కగా ఏర్పడుతుంది. ఫలదీకరణం చేయబడిన అండం లేదా అండం సులభంగా అమర్చగలిగే ప్రాంతాన్ని సిద్ధం చేయడం దీని ఉద్దేశ్యం. గర్భధారణ జరగకపోతే ఈ చిక్కగా ఉన్న ఎండోమెట్రియం షెడ్ అవుతుంది. ఫలితంగా ఋతుస్రావం రూపంలో బయటకు వస్తుంది. ఎండోమెట్రియోసిస్‌ ఉన్న వారిలో గర్భాశయంలోని లోపలి గోడ లేదా లైనింగ్ కటిలోని వివిధ భాగాలలో కనిపిస్తాయి. ఇవి అసాధారణ స్థానాలకు చేరుకుంటాయి. ఎండోమెట్రియం బయటి లైనింగ్ ప్రతి నెలా నిర్దిష్ట సమయాల్లో చిక్కగా మారుతుంది. సాధారణంగా గర్భాశయం లైనింగ్ కాలానుగుణంగా ప్రతి నెలా తొలగిస్తుంది. కానీ ఎండోమెట్రియోసిస్ విషయంలో అలా జరగదు. అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఫలితంగా ప్రారంభంలోనే చికిత్స చేయడం ద్వారా నయం చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.