AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smallest Fish: ఈ చేప గొంతులో లౌడ్‌ స్పీకర్లు ఉన్నాయేమో.. కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే!

పిట్ట కొంచెం.. కూత ఘనం అనే సామెత వినే ఉంటారు. కానీ చేపలు శబ్దాలు చేయడం మీరెప్పుడైనా చూశారా? పోనీ విన్నారా? లేదనే దాదాపు అందరూ సమాధానం చెబుతారు. కానీ ఈ చేప మహా ముదురు. సైజు చూస్తే వేలెడంత కూడా ఉండదు.. కానీ ఇది కూత పెడితే మాత్రం చెవులు చిల్లులు పడాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయిన డానియనెల్లా సెరెబ్రం పొడవు అర అంగుళం. అంటే మనిషి గోరు అంత ఉంటుంది...

Smallest Fish: ఈ చేప గొంతులో లౌడ్‌ స్పీకర్లు ఉన్నాయేమో.. కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే!
Danionella Cerebrum Fish
Srilakshmi C
|

Updated on: Mar 01, 2024 | 8:46 AM

Share

పిట్ట కొంచెం.. కూత ఘనం అనే సామెత వినే ఉంటారు. కానీ చేపలు శబ్దాలు చేయడం మీరెప్పుడైనా చూశారా? పోనీ విన్నారా? లేదనే దాదాపు అందరూ సమాధానం చెబుతారు. కానీ ఈ చేప మహా ముదురు. సైజు చూస్తే వేలెడంత కూడా ఉండదు.. కానీ ఇది కూత పెడితే మాత్రం చెవులు చిల్లులు పడాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయిన డానియనెల్లా సెరెబ్రం పొడవు అర అంగుళం. అంటే మనిషి గోరు అంత ఉంటుంది. కొలతల్లో చెప్పాలంటే 12 మిల్లీమీటర్లు. మయన్మార్‌ నీళ్లలో నివసించే డానియోనెల్లా సెరెబ్రమ్ చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే. ఏకంగా 140 డిసెబుల్స్‌కిపైగా శబ్ధాలు చేయగలవని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం మంగళవారం ప్రచురించిన ఓ పత్రికా ప్రకటనలో నివేదించింది. ఇది 100 మీటర్ల దూరంలో టేకాఫ్‌ సమయంలో విమానం సృష్టించే శబ్ధంతో సమానం. ఇంత చిన్న పరిమాణంలో ఉన్న చేపలు అంతపెద్ద స్థాయిలో శబ్ధాలు ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయో తెలుసుకున్న సైంటిస్టులు సైతం అవాక్కయ్యారు.

నిజానికి అంత సూక్ష్మ పరిమాణంలో ఉన్న జీవులు ఈ విధమైన శబ్ధాలు చేయడం అసాధారణమైన విషయమని సెన్కెన్‌బర్గ్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని ఇచ్థియాలజిస్ట్ అధ్యయన రచయిత రాల్ఫ్ బ్రిట్జ్ అంటున్నారు. సాధారణంగా పెద్ద జంతువులు చిన్న వాటి కంటే పెద్ద శబ్దాలను ఉత్పత్తి చేయగలవు. ఏనుగులు వాటి ట్రంక్‌లతో దాదాపు 125 డెసిబుల్స్ వరకు శబ్దాలు చేయగలవు. అయితే చాలా అరుదైన జంతువులు మాత్రమే వాటి పరిమాణం కంటే ఎన్నో రెట్లు దాదాపు 250 డెసిబుల్స్‌ వరకు అధిక శబ్ధాలు సృష్టించ గలవని బెర్లిన్‌కు చెందిన చారైట్‌ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ఇలా అసాధారణంగా పెద్ద శబ్దాలు చేసే కొన్ని చేప జాతులు కూడా ఉన్నాయట. మగ ప్లెయిన్‌ఫిన్‌ మిడ్‌షిప్‌మ్యాన్‌ చేపలు 130 డెసిబెల్‌ల వరకు శబ్దాలు చేస్తాయట.

అలాగే డానియోనెల్లా సెరెబ్రమ్ చేపలు అంగుళం కంటే చిన్నగా ఉన్నప్పటికీ.. వాటి పక్క టెముకల్లో ధ్వనిని సృష్టించే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ఈ చేపలు వాటి స్విమ్ బ్లాడర్‌కు వ్యతిరేక దిశలో మృదులాస్థిని తాకడం ద్వారా ఈ శబ్దాలను సృష్టించగలుగుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఈ చేపలు140 డెసిబుల్స్‌ వరకు శబ్దం చేయగలవని.. అది అంబులెన్స్‌ సైరన్‌, డ్రిల్లింగ్‌ మిషన్‌ డ్రిల్లింగ్‌ శబ్దానికి సమానంగా ఉంటుందని చెబుతున్నారు. చేపలు నీళ్లలో ఒకదానితో ఒకటి సంభాషించడానికి ఈ విధమైన శబ్దాలు చేస్తుంటాయట. శబ్దాల్ని చేయటంలో ఈ చేపల స్టైలే వేరని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.https://tv9telugu.com/trending