Viral: ఆ గుళ్లోకి నిజంగానే దేవత వచ్చిందా.? వినాయకుని ఆలయంలో భక్తుల పూజలు..
ఇటీవల పర్వదినాల సమయంలో ఆలయాల్లో నాగుపాములు ప్రత్యక్షం కావడం.. భక్తులు పూజలు నిర్వహించడం అనంతరం స్నేక్ క్యాచర్‌ని పిలిచి వాటిని పట్టించి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టడం తరచూ మనం చూస్తున్నాం. తాజాగా చిత్తూరు జిల్లా లోని పాతాళ గణపతి ఆలయంలో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. రాత్రివేళ ఆలయంలోకి ప్రవేశించిన నాగుపామును సాక్షాత్తు నాగదేవతగా భావించి భక్తులు పూజలు నిర్వహించారు.
ఇటీవల పర్వదినాల సమయంలో ఆలయాల్లో నాగుపాములు ప్రత్యక్షం కావడం.. భక్తులు పూజలు నిర్వహించడం అనంతరం స్నేక్ క్యాచర్‌ని పిలిచి వాటిని పట్టించి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టడం తరచూ మనం చూస్తున్నాం. తాజాగా చిత్తూరు జిల్లా లోని పాతాళ గణపతి ఆలయంలో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. రాత్రివేళ ఆలయంలోకి ప్రవేశించిన నాగుపామును సాక్షాత్తు నాగదేవతగా భావించి భక్తులు పూజలు నిర్వహించారు. పూతలపట్టు మండలం నందికొట్కూరు గ్రామంలో పాతాళగణపతి ఆలయం ఉంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. పక్కనే అనుబంధంగా నాగదేవత ఆలయం కూడా ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో ఆలయంలో ఒక్కసారిగా ప్రత్యక్షమైన నాగుపామును చూసి ఆశ్చర్యపోయిన భక్తులు సాక్షాత్తు నాగదేవతే ఇలా వచ్చిందని భావించి పూజలు చేశారు. హారతులిచ్చారు. పాలు నైవేద్యంగా సమర్పించారు. ఈ నాగుపాము రాత్రంతా నాగదేవత ఆలయంలోనే ఉందని చెబుతున్నారు అర్చకులు. రాత్రి ఆలయంలో పూజలు ముగించుకుని వెళ్లినతర్వాత ఆలయంలోని నాగుపాము చేరి ఉండొచ్చని అంటున్నారు. ఈ వార్త తెలుసుకొని స్థానికులు నాగదేవత దర్శనం కోసం పెద్ద క్యూ కట్టారు. నాగుపాముకి పూజలు చేసి, నాగదేవతే దర్శనమిచ్చిందని సంతోషం వ్యక్తం చేసారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos