Health: మీకు అదే పనిగా దాహం వేస్తుందా..? అయితే డేంజర్
కొన్ని సందర్భాల్లో విపరీతమైన దాహం ఏర్పడుతుంది. నీళ్లు తాగిన వెంటనే మళ్లీ దాహం వేస్తుంది. వేసవిలో దాహం వేయడం సర్వసాధారణమైన విషయం. అయితే వాతావరణం చల్లగా ఉన్నా పదే పదే దాహం వేస్తుంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు...

మనిషికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో అన్ని జీవన క్రియలు సక్రమంగా పనిచేయాలంటే కచ్చితంగా సరిపడ నీరు తాగాల్సిందే. అందుకే ప్రతీ రోజూ కచ్చితంగా సరిపడ నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తూనే ఉంటారు. జీర్ణక్రియ సంబంధిత సమస్యల నుంచి మరెన్నో సమస్యలకు మంచి నీరు పరిష్కారం అని చెబుతుంటారు.
ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో విపరీతమైన దాహం ఏర్పడుతుంది. నీళ్లు తాగిన వెంటనే మళ్లీ దాహం వేస్తుంది. వేసవిలో దాహం వేయడం సర్వసాధారణమైన విషయం. అయితే వాతావరణం చల్లగా ఉన్నా పదే పదే దాహం వేస్తుంటే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. తరచూ దాహనం వేయడం కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణమని అంటున్నారు. ఇంతకీ విపరీతమైన దాహం దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..
* పదే పదే దాహం వేస్తూంటే అది మధుమేహం లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను వైద్య పరిభాషలో పాలీడీప్సియాగా పిలుస్తారు. దీనికి కారణం.. డయాబెటిస్ కారణంగా ఇన్సులిన్ పనిచేయదు. దీంతో మూత్రం నుంచి గ్లూకోజ్ రావడం ప్రారంభమవుతుంది. మూత్రంలో గ్లూకోజ్ వెళ్లడం వల్ల శరీరానికి ఎక్కువ నీరు అవసరపడుతుంది. పదేపదే దాహం వేయడానికి ఇదే కారణమని చెబుతున్నారు.
* శరీరంలో కావాల్సినంత నీరు లేని సమయంలో కూడా పదే పదే దాహం వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే డీహైడ్రేషన్ సమస్యగా పిలుస్తుంటారు. ఎక్కువగా చమటలు పట్టడం నిత్యం జ్వరం రావడం దీనికి లక్షణాలుగా చెప్పొచ్చు.
* ఇక కొన్ని అనారోగ్య సమస్యల కోసం ఉపయోగించే మందులను ఉపయోగించినా కూడా తరచూ దాహం వేస్తుంది. దీనికి కారణం కొన్ని మందులు మూత్ర విసర్జన లక్షణాన్ని కలిగిస్తాయి. ఇది అధిక దాహానికి కారణమవుతుంది.
* రక్త హీనత సమస్యతో ఇబ్బంది పడే వారిలోనూ దాహం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో ఆర్బీసీ తక్కువగా ఉన్నప్పుడు కూడా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది.
* శరీరం బలహీనంగా మారినా, శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు లభించకపోయినా తరచూ దాహం వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పదే పదే దాహం వేస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




