Food: ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

సాధారణంగా మనకు మార్కెట్లో రెండు రకాల ఉల్లిపాయలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి తెల్ల ఉల్లిగడ్డ అయితే మరోటి ఎర్ర ఉల్లిగడ్డ. పట్టణాల్లో దాదాపు మనం ఎర్ర ఉల్లి గడ్డలనే చూస్తాం. చాలా తక్కువగా మాత్రమే తెల్ల ఉల్లిగడ్డలు కనిపిస్తాయి. అయితే గ్రామాల్లో మాత్రం ఎక్కువ తెల్ల ఉల్లిగడ్డను చూస్తుంటాం...

Food: ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
Onion
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 03, 2024 | 10:40 PM

‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ ఇది ఒక పాపులర్‌ సామెత. ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలును చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇక ఉల్లి లేకుండా ఏ వంటకాన్ని ఊహించడం అసాధ్యం. ఉల్లి లేకుండా ఒక్క వంటకాన్ని కూడా చేయలేం. అందుకే ఇంట్లో కచ్చితంగా ఉల్లి నిల్వ ఉండేలా చూసుకుంటాం.

ఉల్లి ధరలు పెరిగితే అది పెద్ద వార్త అవ్వడానికి అదే కారణం. అయితే సాధారణంగా మనకు మార్కెట్లో రెండు రకాల ఉల్లిపాయలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి తెల్ల ఉల్లిగడ్డ అయితే మరోటి ఎర్ర ఉల్లిగడ్డ. పట్టణాల్లో దాదాపు మనం ఎర్ర ఉల్లి గడ్డలనే చూస్తాం. చాలా తక్కువగా మాత్రమే తెల్ల ఉల్లిగడ్డలు కనిపిస్తాయి. అయితే గ్రామాల్లో మాత్రం ఎక్కువ తెల్ల ఉల్లిగడ్డను చూస్తుంటాం. ఇంతకీ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది.? ఏ ఉల్లిగడ్డ వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఎర్ర ఉల్లిగడ్డతో పోల్చితే తెల్ల ఉల్లిగడ్డ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం తెల్ల ఉల్లిగడ్డ వల్ల ప్రయోజనాలే. తెల్లి ఉల్లిపాయలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఎక్కువగా విటమిన్‌ సి, ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోన్యూట్రియెంట్‌ ఆరోగ్యాన్ని కాపాడడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో తెల్ల ఉల్లిగడ్డ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు సైతం చెబుతున్నారు.

తెల్ల ఉల్లిలోని క్రోమియమం, సల్ఫర్‌లు రక్తంలోని షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో ఈ ఉల్లిగడ్డను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా తెల్ల ఉల్లిలోని సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతుంది. ముఖ్యంగా శరీరంలో ఏర్పడే కణితిల పెరుగుదులను నిరోధించడంలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది.

తెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లి సహాయ పడుతుంది. అయితే ఎర్ర ఉల్లి గడ్డలోనూ ఇలాంటి లాభాలే ఉన్నా.. ఎక్కువగా మాత్రం తెల్ల ఉల్లిగడ్డలోనే ఎక్కువగా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్