Health: గొంతు నొప్పి వేధిస్తోందా..? సింపుల్‌గా ఇలా చెక్ పెట్టండి..
గొంతు నొప్పికి కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ కూడా కారణమవుతుంది. గొంతు బొంగురు పోవడం, లేదా వాచినట్లు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకున్న ఆహారాన్ని మింగడం ఇబ్బందికరంగా మారుతుంది. అయితే గొంతు ఇన్ఫెక్షన్ వస్తే వైద్యుడిని సంప్రదించే కంటే ముందే, కొన్ని సింపుల్ హోమ్ రెమిడిస్...

సీజన్ మారిన సందర్భాల్లో లేదా చల్లటి నీరు తాగినా గొంతు నొప్పి సమస్య వస్తుంది. గొంతు నొప్పికి కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ కూడా కారణమవుతుంది. గొంతు బొంగురు పోవడం, లేదా వాచినట్లు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకున్న ఆహారాన్ని మింగడం ఇబ్బందికరంగా మారుతుంది. అయితే గొంతు ఇన్ఫెక్షన్ వస్తే వైద్యుడిని సంప్రదించే కంటే ముందే, కొన్ని సింపుల్ హోమ్ రెమిడిస్ ద్వారా గొంతు నొప్పి నుంచి బయటపడొచ్చు. ఇంతకీ ఆ సింపుల్ నేచురల్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
* గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఉప్పు నీరు బెస్ట్ రెమిడీగా చెప్పొచ్చు. ఉప్పనీటిని పుకిలించి ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుంది. ఉప్పులోని యాంటీ బ్యాక్టీరియల్ కారణంగా గొంతు ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందొచ్చు.
* పాలలో, పసుపు కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలిసిందే. అయితే గొంతు నొప్పితో బాధపడే సమయంలోనూ పసుపు, పాలు తీసుకోవడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ నుంచి బయటపడొచ్చు. అలాగే నీళ్లలో పసుపు వేసి కాసేపు మరిగించి తర్వాత పుకిలించి ఉంచినా మంచి ఫలితం ఉంటుంది. రోజుకు రెండుమూడు సార్లు ఇలా చేస్తే గొంతు వాపు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
* చామంతి పూలతో చేసే టీ తాగడం వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్, నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మేలు చేస్తాయి. ఇవి కళ్ళు, ముక్కు, గొంతు వాపు నుండి ఉపశమనాన్ని అందించడంలో ఉపయోగపడతాయి.
* గొంతులో వాపు, నొప్పితో ఇబ్బందిపడే వారికి ఆవిరితీసుకోవడం మంచి సహజ టెక్నీక్‌గా చెప్పొచ్చు. వేడి నీటిలో పసుపు వేసుకొని ఆవిరి పట్టుకోవడం వల్ల గొంతు సమస్యల నుంచి బయటపడొచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే, ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..




