Andhra Pradesh: ఆమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఏఈ! గుంటూరులో అవినీతి తిమింగళం..

సర్కార్ కొలువు చేస్తూ అవినీతికి అలవాటు పడ్డ భారీ అవినీతి తిమింగళం ఎసీబీ వలకు చిక్కింది. మంజూరైన బిల్లులను ప్రాసెస్‌ చేసేందుకు లంచం తీసుకుంటూఅవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సదరు ప్రభుత్వ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు. గుంటూరు ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్‌ స్టోరేజీ (ఎస్‌ఎస్‌) ట్యాంకర్‌కు..

Andhra Pradesh: ఆమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఏఈ! గుంటూరులో అవినీతి తిమింగళం..
AE Officer P Sivaramakrishna
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 02, 2024 | 7:24 AM

నగరంపాలెం, మార్చి 2: సర్కార్ కొలువు చేస్తూ అవినీతికి అలవాటు పడ్డ భారీ అవినీతి తిమింగళం ఎసీబీ వలకు చిక్కింది. మంజూరైన బిల్లులను ప్రాసెస్‌ చేసేందుకు లంచం తీసుకుంటూఅవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సదరు ప్రభుత్వ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు. గుంటూరు ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్‌ స్టోరేజీ (ఎస్‌ఎస్‌) ట్యాంకర్‌కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్, ఫెన్సింగ్‌ పనులను ఇటీవల పూర్తి చేశారు. గుంటూరు రూరల్‌ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌ ఈ పనులను పూర్తి చేశారు. అందుకుగాను మూడు బిల్లులకు కలిపి ప్రభుత్వం నుంచి దాదాపు రూ.42 లక్షలు మంజూరయ్యాయి.

అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్‌ చేసేందుకు రూరల్‌ వాటర్‌ సప్లయి/శానిటేషన్‌ గుంటూరు డివిజన్‌ పరిధిలోని పెదకాకాని ఏఈ అధికారి పి శివరామకృష్ణ వద్దకు కాంట్రాక్టర్‌ రవికిషోర్‌రెడ్డి వెళ్లాడు. ఈ క్రమంలో శాంక్షన్‌ అయిన బిల్లుల మొత్తం చేతికి అందాలంటే లంచం ఇచ్చుకోవల్సి ఉంటుందని డిమాండ్‌ చేశారు. రూ.42 లక్షల బిల్లులకు నాలుగు శాతం చొప్పున అంటు రూ.1.68 లక్షలు ఇవ్వాలంటూ ఏఈ శివరామకృష్ణ డిమాండ్‌ చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ రవికిషోర్‌రెడ్డి తెలివిగా టోల్‌ఫ్రీ నంబర్‌ 14400ను సంప్రదించి, తనగోడును విన్నవించుకున్నాడు. ఏఈ శివరామకృష్ణను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు పథకం పన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారుల సూచనల మేరకు నగదు ఇవ్వడానికి రవికిషోర్‌రెడ్డి కూడా అంగీకరించాడు. దీంతో జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పీఆర్‌ (ఆర్‌డబ్ల్యూఎస్‌) డివిజన్‌ కార్యాలయం వద్దకు శుక్రవారం సాయంత్రం రావాలని కాంట్రాక్టర్‌కు ఏఈ శివరామకృష్ణ సూచించారు.

ఆ ప్రకారంగానే అక్కడకు వెళ్లిన కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.68 లక్షల లంచం తీసుకుంటున్న శివరామకృష్ణను.. అక్కడే పొంచిఉన్న గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం పలకలూర్‌రోడ్‌లోని ఏఈ నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు టీవీవీ ప్రతాప్‌ కుమార్, ఎన్‌.సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.