AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Election: పవన్‌కి కటీఫ్ చెప్పేందుకు కమలం పార్టీ రెఢి.. ఒంటరి పోరు బీజేపీ సిద్ధం!

జనసేన వైఖరితో భారతీయ జనతా పార్టీ విసిగిపోయిందా? చంద్రబాబుతో అంటకాగుతున్న పవన్‌కి కటీఫ్ చెప్పేందుకు కమలం పార్టీ సిద్ధమైందా? ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగాలని కాషాయదళం నిర్ణయించుకుందా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. మరి అదే జరిగితే జనసేన – బీజేపీ పొత్తు సంగతి ఏంటి? ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది? అన్నదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదలైన చర్చ. లెక్కలు, సీట్ల విషయంలో ఓ కొలిక్కి వచ్చిన టీడీపీ – జనసేన.. 99 […]

AP Election: పవన్‌కి కటీఫ్ చెప్పేందుకు కమలం పార్టీ రెఢి.. ఒంటరి పోరు బీజేపీ సిద్ధం!
Ap Politics
Balaraju Goud
|

Updated on: Mar 02, 2024 | 8:31 AM

Share

జనసేన వైఖరితో భారతీయ జనతా పార్టీ విసిగిపోయిందా? చంద్రబాబుతో అంటకాగుతున్న పవన్‌కి కటీఫ్ చెప్పేందుకు కమలం పార్టీ సిద్ధమైందా? ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగాలని కాషాయదళం నిర్ణయించుకుందా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. మరి అదే జరిగితే జనసేన – బీజేపీ పొత్తు సంగతి ఏంటి? ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది? అన్నదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదలైన చర్చ.

లెక్కలు, సీట్ల విషయంలో ఓ కొలిక్కి వచ్చిన టీడీపీ – జనసేన.. 99 మంది అభ్యర్థులను ప్రకటించి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. తాడేపల్లిగూడెంలో జెండా ఎత్తిన ఈ రెండు పార్టీలు.. బీజేపీ ఆశీర్వాదం కూడా తమకు ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశాయి. కానీ వాస్తవంగా చూస్తుంటే పరిస్థితులు మరోలా ఉన్నాయి.

టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. జనసేనతో కటీఫ్ చెప్పి, అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఒంటరి పోరుకు సిద్ధంగా ఉండాలని జిల్లా నేతలకు ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్లాయి. ప్రజా పోరు యాత్రలు మరింత గట్టిగా చెయ్యాలని పార్టీ నిర్ణయించింది. మరోవైపు అభ్యర్థులను సైతం ఫైనల్ చేసే పనిలో ఉంది రాష్ట్ర బీజేపీ.

మరోవైపు 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. ఇప్పటికే లిస్ట్ ను ఫైనల్ చేయ్యమని ఢిల్లీ అధినాయకత్వం నుండి ఆదేశాలు కూడా అందాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే 2,500 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో సీటుకు సగటున 8మంది పోటీ పడుతున్నారు. దీంతో వాటిని పరిశీలించి.. అభ్యర్థులను వడబోసే పనిలో ఉంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో ఇవాళ, రేపు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలను బీజేపీ నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి ప్రతి జిల్లా నుంచి ఆరుగురు ముఖ్యనేతలు హజరు కాబోతున్నారు. వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక్కో సెగ్మెంట్ నుంచి ముగ్గురిని ఎంపిక చేసి.. ఆ లిస్ట్‌ను అధిష్టానానికి పంపే ఆలోచనలో ఉంది రాష్ట్ర బీజేపీ.

కాపు సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లే ప్లాన్..!

ఒంటరిగా వెళ్తే కాపు నినాదంతో వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో బీసీ సీఎం తరహాలో ఏపీలో కాపు సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఆలోచనలో ఉంది బీజేపీ. టీడీపీలో కమ్మ, వైసీపీలో రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉందనే ప్రచారం ఉంది. పైగా ఈ రెండు కులాలే ఇప్పటిదాకా రాజ్యాధికారాన్ని దక్కించుకున్నాయి. సీఎం పీఠంపై కూర్చోవాలనే కాపుల కలలు ఇప్పటిదాకా కలగానే మిగిలాయి. ఈ నేపథ్యంలో కాపు సీఎం నినాదంతో వెళ్తే.. రాష్ట్రంలో 20 శాతం ఉన్న కాపులు బీజేపీకి దగ్గరవుతారనే ఆలోచన చేస్తోంది కాషాయదళం.

30 మంది లీడర్లు బీజేపీ టచ్‌లో ఉన్నట్టు ప్రచారం

అదే సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ సైతం చేపట్టే ప్లాన్‌లో ఉంది. టీడీపీ, వైసీపీ అసంతృప్తులపై ఫోకస్‌ పెట్టి.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 30 మందికి పైగా లీడర్లు బీజేపీకి టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే పారిశ్రామికవేత్తలను పార్టీలోకి చేరుకున్న బీజేపీ.. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను చేర్చుకునే పనిలో పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ – జనసేన ఎలా ముందుకు వెళ్తాయో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..