AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huge Snake Carcass: వైజాగ్‌ బీచ్‌లో వింత జీవి.! హడలిపోయిన స్థానికులు.. వీడియో.

Huge Snake Carcass: వైజాగ్‌ బీచ్‌లో వింత జీవి.! హడలిపోయిన స్థానికులు.. వీడియో.

Anil kumar poka
|

Updated on: Mar 02, 2024 | 11:43 AM

Share

వైజాగ్ తీరంలో ఓ వింతజీవి కలేబరం కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ జీవిని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదేదో పెద్ద భయంకరమైన పాము అనుకున్నారు. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు.

వైజాగ్ తీరంలో ఓ వింతజీవి కలేబరం కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ జీవిని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదేదో పెద్ద భయంకరమైన పాము అనుకున్నారు. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనలకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు. ఈ భారీ పాము కళేబరాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు గుడ్లవాని పాలెం అమ్మవార్ల ఆలయాల తీరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ గా మారాయి. విశాఖ తీరంలో ఇలాంటి వింతలు నిరంతరం చోటు చేసుకుంటూనే ఉంటాయి. రకరకాల విచిత్రమైన జంతువుల ఆనవాళ్లు, వాటి కళేబరాలు దొరుకుతూనే ఉంటాయి. ఇటీవల సి హార్స్ పేరుతో ఒక చేప వింత ఆకారంలో తీరానికి చేరింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos