Rare Whale: సిక్కోలు జిల్లా తీరానికి కొట్టుకొచ్చిన భారీ అరుదైన చేప.. దాని బరువు తెలిస్తే షాక్..!

సముద్ర తీర ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి. అరుదైన సముద్ర జీవులు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఇచ్చాపురం మండలం, డోంకురు తీరప్రాంతంకి అరుదైన భారీ చేప కొట్టుకువచ్చింది. అది అప్పటికే మృతి చెందింది. దాని పొడవు సుమారు 16అడుగులు కాగా.. వెడల్పు సుమారు 6 ఆడుగులు ఉంది.

Rare Whale: సిక్కోలు జిల్లా తీరానికి కొట్టుకొచ్చిన భారీ అరుదైన చేప.. దాని బరువు తెలిస్తే షాక్..!
Rare Largest Heavy Whale
Follow us
S Srinivasa Rao

| Edited By: Balaraju Goud

Updated on: Mar 02, 2024 | 1:08 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత పొడవైన సముద్రతీర ప్రాంతం ఉన్న జిల్లా శ్రీకాకుళం. జిల్లాలో 193 కి.మీ. పొడువున బంగాళాఖాతం సముద్ర తీరం విస్తరించి ఉంది. అందుకే ఈ తీర ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి. అరుదైన సముద్ర జీవులు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఇచ్చాపురం మండలం, డోంకురు తీరప్రాంతంకి అరుదైన భారీ చేప కొట్టుకువచ్చింది. అది అప్పటికే మృతి చెందింది. దాని పొడవు సుమారు 16అడుగులు కాగా.. వెడల్పు సుమారు 6 ఆడుగులు ఉంది.

ఇక అరుదైన చేప బరువు రెండు టన్నులు ఉంటుందని స్థానిక మత్స్యకారుల అంచనా వేశారు. ఇంత భారీ చేప ఎందుకు కొట్టుకువచ్చింది అనేదానిపై ఇంకా సరైన సమాచారం లేదు. అయినప్పటికి ఆహారం దొరకక, అనారోగ్యంతో మృతి చెందిగాని లేదా సముద్రంలో భారీ బోటుల దాటికి గాయపడి గాని మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈ చేపను పులి బగ్గు పొర్ర చేప అని పిలుస్తారని చెబుతున్నారు స్థానిక మత్స్యకారులు.

చేపను చూసేందుకు భారీగా తరలివచ్చిన స్థానికులు

అరుదైన భారీ చేప కావడంతో విషయం తెలిసి చేపను చూసేందుకు డోంకురు గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. కొందరు అంత పెద్ద సైజులో ఉన్న చేపను చూసి ఫోటోలు తీసుకున్నారు. స్కూల్ కి వెళ్ళే చిన్నారులు అయితే చేప పైకి ఎక్కి గంతులు వేస్తూ కేరింతలు కొట్టారు. విషయం తెలిసి బుదవారం పలాస కాశీబుగ్గ అటవీ రేంజ్ ఆఫీసర్ మురలినాయుడు మృతిచెందిన భారీ చేపను పరిశీలించారు. అక్కడే మృతి చెందిన చేపకు పోస్టు మార్టం నిర్వహించి సాగర తీరంలోనే పాతిపెట్టారు.

వీడియో చూడండి…

గతంలోనూ తీరం చేరిన భారీ చేపలు

గతంలోనూ సిక్కోలు తీరంకి భారీ చేపలు కొట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2022 లో ఏప్రిల్ సంతబొమ్మాలి మండలం ఎం.సున్నాపల్లి గ్రామoలో 2022 , మే నెలలో భారీ చేప కొట్టుకువచ్చింది. 2023 లోను వజ్రపు కొత్తూరు మండలం సముద్ర తీరానికి మరో చేప ఈదుకుంటూ వచ్చి ఇసుక తెన్నుల్లో ఇరుక్కుంది. స్థానికులు దానిని సముద్ర తీరం లోకి నెట్టగా మెల్లగా సముద్ర జలాల్లోకి చేరుకుంది భారీ చేప. 2022 లో సంతబొమ్మాళి మండలం సముద్ర తీరానికి బంగారు వర్ణంతో కూడిన రథం కొట్టుకు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!