YS Jagan: 3 కీలక స్థానాలపై స్పెషల్ ఫోకస్‌.. వ్యుహాత్మకంగా పావులు కదుపుతున్న సీఎం జగన్

వై నాట్ 175 అంటోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మూడు కీలక స్థానాలపై స్పెషల్ ఫోకస్‌ చేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న మూడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

YS Jagan: 3 కీలక స్థానాలపై స్పెషల్ ఫోకస్‌.. వ్యుహాత్మకంగా పావులు కదుపుతున్న సీఎం జగన్
Ys Jagan Target
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 02, 2024 | 7:23 AM

వై నాట్ 175 అంటోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మూడు కీలక స్థానాలపై స్పెషల్ ఫోకస్‌ చేశారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న మూడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

ఏపీలో ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ జాగ్రత్తగా వ్యుహలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా విపక్షంలోని కీలక నేతలు పోటీ చేసే కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుండటంతో వైసీపీ తరపున కేఆర్‌జే భరత్‌ను బరిలోకి దించాలని నిర్ణయించారు. మొదటినుంచి ఈ స్థానం టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే ఈసారి ఆ సెంటిమెంట్‌ను మార్చేయాలని భావిస్తోంది వైసీపీ అధిష్ఠానం.

తెలుగుదేశం పార్టీ తరపున నారా లోకేశ్‌ బరిలోకి దిగుతున్న మంగళగిరి అసెంబ్లీ స్థానంపై ముందునుంచే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు జగన్‌. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కేను కాదని మంగళగిరి ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవిని నియమించిన జగన్‌ చివరకు మనసు మార్చుకున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కేను సీఎంవోకు పిలిచి జగన్‌ చర్చించారు. చివరికి లావణ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం.. కలిసికట్టుగా పనిచేసి ఆమెను గెలిపించుకు రావాలని సూచించారు.

వాస్తవానికి తనను కాదని గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్‌ఛార్జ్‌గా నియమించడంపై తొలుత కినుక వహించి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిన ఆర్కే ఆ తర్వాత వ్యూహం మార్చి మళ్లీ వెనక్కు వచ్చారు. సీఎం జగన్‌ను కలుసుకుని వైసీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానన్నారు ఆర్కే. మంగళగిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న గంజి చిరంజీవిని కాదని మురుగుడు లావణ్యను అభ్యర్ధిగా ప్రకటించడం జగన్‌ వ్యూహంలో భాగమే.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దించాలని జగన్‌ యోచిస్తున్నారు. వంగా గీత ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని వంగా గీతకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు.

కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పూర్తి ఫోకస్‌తో పనిచేయాలని వైసీపీ కేడర్‌కు సూచించారు జగన్‌. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల సామర్థ్యాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఆయా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!