Goa Tourist Viral Video : గోవాలో రెచ్చిపోయిన యువతీ యువకులు.. బైక్‌లపై రైడ్ చేస్తూ హంగామా.. విడిపోయి కొట్టుకుంటున్న నెటిజన్లు.. !
మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట పెను దుమారం రేపుతోంది. 6 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను చూశారని, చాలా మంది వ్యక్తులు వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి వైఖరిని ప్రశ్నించారు. వీరంతా ఉత్తర గోవాకు చెందిన వారని, ఇది ఇప్పుడు ఇక్కడ సాధారణ జీవన శైలిగా మారిందని కొందరు వాదిస్తున్నారు. వీరంతా గోవాలో ఇళ్లు కొనుకుని ఇక్కడే నివసిస్తున్నారని కూడా రాశారు.
గోవా నుండి ఒక వీడియో వైరల్ అవుతోంది. జాలీ ట్రిప్‌కు వచ్చిన కొందరు యువతీ యువకుల బృందం చేసిన హంగామా ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియో చూసిన జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోపంతో మండిపడుతూనే వీడియోను వైరల్‌గా మార్చేశారు. అయితే ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి భిన్న వాదనలతో కామెంట్ల వార్ నడిపిస్తున్నారు. అయితే, ఇంతకీ గోవా నుండి వచ్చిన ఈ వీడియోలో ఏముందంటే..
వైరల్ వీడియోలో, ఇద్దరు వ్యక్తులు రెండు స్కూటీలపై ప్రయాణిస్తున్నారు. రెండు స్కూటర్ల మీద ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూర్చుని ఉన్నారు. అమ్మాయిలు వెనుక కూర్చున్నారు. కానీ ఇద్దరూ వెనక్కి తిరిగి కూర్చున్నారు. వారిలో ఎవరూ హెల్మెట్ ధరించ లేదు. అందుకే ఎవరో వారి వీడియో రికార్డ్ చేసి అభ్యంతరం తెలిపారు. దయచేసి మీరు మర్యాదపూర్వకంగా ప్రవర్తించమని కోరుతున్నాము అంటూ కొందరు విమర్శించగా, వీరంతా ఉత్తర గోవాకు చెందిన వారని, ఇది ఇప్పుడు ఇక్కడ సాధారణ జీవన శైలిగా మారిందని కొందరు వాదిస్తున్నారు. వీరంతా గోవాలో ఇళ్లు కొనుకుని ఇక్కడే నివసిస్తున్నారని కూడా రాశారు. వాళ్ళు ఇలా ప్రవర్తించరు. వారు చాలా బాగా స్థానికులతో సహకరిస్తారని ఒక వర్గం వాదించారు.
To every Indian visiting Goa. Please please keep your behaviour in a cow shed before entering the state. Please act civil is all we ask. This is in North Goa and a usual pattern now. pic.twitter.com/RJ5QyfbqiU
— HermanGomes_journo (@Herman_Gomes) March 3, 2024
మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట పెను దుమారం రేపుతోంది. 6 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను చూశారని, చాలా మంది వ్యక్తులు వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి వైఖరిని ప్రశ్నించారు. ఈ పోస్ట్ తర్వాత చాలా మంది తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఇందులో తప్పు ఏమిటో నాకు అర్థం కావడం లేదని ఒకరు రాశారు. ద్విచక్ర వాహనంపై వెనక్కి తిరిగి కూర్చోవడం వారికి ప్రమాదమేనని, కానీ, ఆ బైక్ కూడా నెమ్మదిగా కదులుతోందన్నారు.. వారు కూడా ఎవరికీ ఎలాంటి హాని చేయలేదని మరొకరు వ్యాఖ్యనించారు. వారంతా టూరిస్టులయితే గనుక.. ఆ టూరిస్టుల పరువు తీసే ముందు గోవా ఆర్థిక వ్యవస్థకు వారు ఎంతగానో దోహదపడతారని భావించాలని ఇంకొకరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..