AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mellacheruvu: మహాశివరాత్రి జాతరకు మేళ్లచెరువు ముస్తాబు.. విభిన్న పోటీలకు సర్వం సిద్ధం..గెలిచిన వారికి..

ఎనిమిది విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో 80 బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ ఎద్దుల పోటీల్లో గెలిస్తే పరమశివుడి ఆశీస్సులు ఉంటాయని భక్తుల విశ్వాసం. ఐదు రోజులపాటు జరిగే మేళ్లచెరువు జాతరలో సాంఘిక పౌరాణిక నాటకాలు భక్తులను ఆకట్టుకొనున్నాయి. ఈ  ఐదు రోజులూ పురాణ ప్రవచనాలు, భాగవతోపన్యాసాలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతూ ఉంటుంది.

Mellacheruvu: మహాశివరాత్రి జాతరకు మేళ్లచెరువు ముస్తాబు.. విభిన్న పోటీలకు సర్వం సిద్ధం..గెలిచిన వారికి..
Mellacheruvu
M Revan Reddy
| Edited By: Jyothi Gadda|

Updated on: Mar 06, 2024 | 1:26 PM

Share

మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని ఇష్టకామేశ్వరి సమేత, స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి ఆలయం రాష్ట్రంలో దక్షిణకాశీగా విరాజిల్లుతోంది. మేళ్లచెరువు శివాలయంలో ఈ నెల 8వ తేదీ నుంచి మహా శివరాత్రి వేడుకలను ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఐదు రోజులపాటు జరిగే జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు అధికార యంత్రం ఏర్పాట్లు చేసింది.

శివాలయంలో ప్రత్యేక పూజలు..

మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలూ, లింగోద్భవకాల అభిషేకాలూ, శివకల్యాణోత్సవాలను ఇక్కడ వైభవోపేతంగా జరుపుతారు. మేళ్లచెరువు జాతరకు గతేడాది సుమారు ఐదు లక్షల మంది హాజరు కాగా… ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. జాతరకొచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు, తాగునీటి వసతి, చలువ పందిళ్లు, పార్కింగ్ స్థలాలు, క్రీడా ప్రాంగణాలు, బారీ కేడ్లు, సానిటేషన్, వైద్య శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక ఆకర్షణగా ప్రభలు..

మహాశివరాత్రి సందర్భంగా జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతాయి. తెలంగాణలో ఎక్కడ కనిపించని విద్యుత్ ప్రభలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో కోటప్పకొండ తర్వాత అంత ప్రాముఖ్యత ఈ జాతర ప్రభలకు ఉంది. రెండు రోజుల పాటు వంద నుంచి 110 అడుగుల ఎత్తయిన ప్రభలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రభలను విద్యుద్దీపాలతో ముస్తాబు చేస్తారు. ఈ ప్రభలను వాటి మీద ఏర్పాటుచేసే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలతో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోతుంది.

ఎద్దుల పోటీలు…

మేళ్లచెరువులో మహాశివరాత్రి ఉత్సవాల అనగానే గుర్తుకు వచ్చేది ఎద్దుల పోటీలు.రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఎద్దుల పందేలు ఇక్కడ నిర్వహిస్తారు. రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈ ఎద్దుల పోటీల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ పడుతుంటారు. ఈ ఎద్దుల పోటీల్లో పాల్గొనేందుకు రెండు మూడు నెలల ముందు నుంచే ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎనిమిది విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో 80 బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ ఎద్దుల పోటీల్లో గెలిస్తే పరమశివుడి ఆశీస్సులు ఉంటాయని భక్తుల విశ్వాసం. ఐదు రోజులపాటు జరిగే మేళ్లచెరువు జాతరలో సాంఘిక పౌరాణిక నాటకాలు భక్తులను ఆకట్టుకొనున్నాయి. ఈ  ఐదు రోజులూ పురాణ ప్రవచనాలు, భాగవతోపన్యాసాలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతూ ఉంటుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..