Lifestyle: రోజూ రెండు ఖర్జూరాలు తినండి చాలు.. మార్పు అస్సలు ఊహించరు
ఉదయం లేవగానే ఖర్జూరాలను తీసుకుంటే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ దరిచేరకుండా చేస్తుంది. ఖర్జూరం గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వాడకం వల్ల మలబద్ధకం, జీవక్రియ వంటి సమస్యలు దరిచేరవని సూచిస్తున్నారు...
ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీరోజూ ఖర్జూరాను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుంటారు. క్రమంతప్పకుండా ప్రతీరోజూ రెండు ఖర్జురాలు తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు. ఖర్జూరాలోని సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. క్రమంతప్పకుండా రోజూ రెండు ఖర్జూరాలు తీసుకుంటే ఎలాంటి లాభాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం లేవగానే ఖర్జూరాలను తీసుకుంటే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ దరిచేరకుండా చేస్తుంది. ఖర్జూరం గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వాడకం వల్ల మలబద్ధకం, జీవక్రియ వంటి సమస్యలు దరిచేరవని సూచిస్తున్నారు.
ఇక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఐరన్, ఫోలేట్, ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక వ్యాధులను నయం చేస్తుంది. ఖర్జూరాల్లో ఫ్రక్టోజ్ పుష్కలంగా లభిస్తుంది. అయితే ఖాళీ కడుపుతో ఖర్జూరాన్ని తీసుకుంటే, కడుపు నొప్పి సమస్య వెంటాడుతుందని చెబుతున్నారు. ఖర్జూరం కడుపు నిండా తినడం కూడా మంచిది కాదు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత కూడా కడుపు నిండుగా ఉంటుంది. ఖర్జూరంలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
ఉదయం అల్పాహారం తర్వాత ఖర్జూరను తీసుకుంటే ఇన్‌స్టాంట్ శక్తి లభిస్తుంది. ఖర్జూరాన్ని ఉదయం పూట తినడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు శుభ్రపడతాయి. గుండె, కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ముఖ కాంతిని పెంచడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..