Anti-Aging Food: వయస్సు దాచేసే ఆహారాలివే! చర్మాన్ని బిగుతుగా చేసి నవయవ్వనంగా మార్చుతాయ్..
వయసు పైబడుతున్న కొద్దీ శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో ముఖంపై ముడతలు ఏర్పడటం సహజం. దీనిని నివారించడానికి చాలామంది తరచూ బ్యూటీపార్లర్‌కి వేల కొద్దీ డబ్బు వృధా చేసుకుంటూ ఉంటారు. యాంటీ ఏజింగ్ క్రీములు రాయడం, ట్రీట్‌మెంట్ తీసుకోవడం వంటి ఎన్నో ప్రయత్నిస్తుంటారు. కానీ కాలం గడిచే కొద్దీ వయసు పెరుగడం ఎంత సహజమో.. ఏదో ఒకరోజు ముసలివారైపోతామనేది కూడా అంతే సహజం..
వయసు పైబడుతున్న కొద్దీ శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో ముఖంపై ముడతలు ఏర్పడటం సహజం. దీనిని నివారించడానికి చాలామంది తరచూ బ్యూటీపార్లర్‌కి వేల కొద్దీ డబ్బు వృధా చేసుకుంటూ ఉంటారు. యాంటీ ఏజింగ్ క్రీములు రాయడం, ట్రీట్‌మెంట్ తీసుకోవడం వంటి ఎన్నో ప్రయత్నిస్తుంటారు. కానీ కాలం గడిచే కొద్దీ వయసు పెరుగడం ఎంత సహజమో.. ఏదో ఒకరోజు ముసలివారైపోతామనేది కూడా అంతే సహజం. వయసు ఒక్కసారి పెరిగితే చిన్నదయ్యే అవకాశం ఉండదు. వయసు పెరిగే కొద్దీ అనేక సమస్యలు కూడా పెరుగుతాయి. జీవితం చాలా క్లిష్టంగా మారుతుంది. వివిధ సమస్యలు శరీరంలో తిష్టవేస్తాయి. చర్మం పొడిగా మారి, ముడుతలు పడటం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలో మీరు చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, చర్మం సహజ గ్లో కాపాడుకోవడం మునుముందు సాధ్యం కాదు. అందుకు షాపుల్లో ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీమ్‌లను కొనాల్సిన అవసరం లేదు.. ఫేషియల్ కోసం పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్‌గా రోజువారీ ఆహారంలో ఈ కింది 4 ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది. వీటితో శరీరం ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఎలాంటి చర్మ సమస్యలు తలెత్తవు. చర్మం కాంతివంతంగా ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
రెగ్యులర్ గా ఎలాంటి ఆహారాలు తినాలంటే..
గుడ్లు
గుడ్లు ప్రోటీన్ పవర్‌హౌస్‌గా పిలుస్తారు. రోజువారీ ఆహారంలో ఒక గుడ్డు తప్పనిసరిగా తీసుకోవాలి. వృద్ధాప్యాన్ని నివారించడానికి, కండరాల బలాన్ని పెంచడానికి, జుట్టు, చర్మ సంరక్షణకు గుడ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అన్ని వయసుల వారు గుడ్లు తినాలి.
తాజా కూరగాయలు
ప్రతిరోజూ ఏవైనా కూరగాయలు తప్పక తినాలి. పాలకూర, ఆవాలు, ఎర్రటి ఆకుకూరలు, కొల్మీ ఆకుకూరలు, కోస్లా ఆకుకూరలు, తాజా కూరగాయలు.. వీలైతే వీటిని పచ్చిగా తినడం మంచిది. మార్కెట్‌లో చాలా రకాల కూరగాయలు దొరుకుతాయి. పొట్లకాయలో చర్మానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, క్లోరోఫిల్ ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి.
విటమిన్ సి ఆహారాలు
లైకోపీన్, పొటాషియం సమృద్ధిగా ఉన్న ఏదైనా పండ్లను మీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. రోజూ పుచ్చకాయ తింటే చాలా మంచిది. ఇప్పుడు పుచ్చకాయలు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. పుచ్చకాయలో యాంటీ ఏజింగ్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ పుచ్చకాయ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
పెరుగు
మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పెరుగు తినాలి. పెరుగులో చాలా ప్రొటీన్లు ఉంటాయి. పెరుగులో కాల్షియం, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ఎక్స్‌ఫోలియేషన్‌లో సహాయపడుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో పెరుగు కూడా చేర్చుకోండి.
మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్ చేయండి.