Hyderabad: నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు.. తృటిలోప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్!
హైదరాబాద్‌లోని సైఫాబాద్ రోడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం (మార్చి 6) నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ షాకింగ్ సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది..
హైదరాబాద్, మార్చి 6: హైదరాబాద్‌లోని సైఫాబాద్ రోడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం (మార్చి 6) నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ షాకింగ్ సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.
కారు లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తుండగా అందులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కారును రోడ్డు పక్కన ఆపుజేశాడు. దీంతో అందులో ఉన్న వారంతా వెంటనే దిగిపోయారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే కారులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో పాటు అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో లక్డీకపూర్ పరిసరప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ పంపును మూసి వేశారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.
దీంతో సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి అగ్నిమాపక యంత్రాలను తీసుకొచ్చి పోలీసులు మంటలను అదుపు చేశారు. అనంతరం కాసేపటికే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. పాత కారు కావడంతో కారులో షార్ట్ సర్క్యూట్ అయ్యి, మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
A car caught fire at Lakdikapul junction in Hyderabad. No injuries reported. pic.twitter.com/qw6TjWtj9W
— The Siasat Daily (@TheSiasatDaily) March 6, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.