TSPSC Exam Dates: టీఎస్పీయస్సీ గ్రూప్-1,2,3 ఉద్యోగాలకు రాత పరీక్షల తేదీలు విడుదల.. ఏయే తేదీల్లో ఏ పరీక్ష జరుగుతుందంటే..

తెలంగాణ గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. టీఎస్పీయస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల గ్రూప్‌ 1 పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్సీయస్సీ.. బుధవారం (మార్చి 6) ఇతర పోటీ పరీక్షల తేదీలను వెల్లడిస్తూ ప్రకటన వెలువరించింది. జూన్‌ 9న గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ నిర్వహించనున్నట్లు..

TSPSC Exam Dates: టీఎస్పీయస్సీ గ్రూప్-1,2,3 ఉద్యోగాలకు రాత పరీక్షల తేదీలు విడుదల.. ఏయే తేదీల్లో ఏ పరీక్ష జరుగుతుందంటే..
TSPSC Exam Dates
Follow us

|

Updated on: Mar 06, 2024 | 5:33 PM

హైదరాబాద్‌, మార్చి 6: తెలంగాణ గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. టీఎస్పీయస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల గ్రూప్‌ 1 పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్పీయస్సీ.. బుధవారం (మార్చి 6) ఇతర పోటీ పరీక్షల తేదీలను వెల్లడిస్తూ ప్రకటన వెలువరించింది. జూన్‌ 9న గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ గతంలో (ఫిబ్రవరి 26) వెల్లడించారు. అయితే గ్రూప్‌ 1 మెయిన్స్‌తో సహా గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పరీక్షల తేదీలపై చర్చించిన కమిషన్‌ బుధవారం ప్రిలిమ్స్‌ పరీక్షల తేదీలను ప్రకటించింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ అక్టోబర్‌ 21 నుంచి జరుగుతాయి. గ్రూప్‌ 2 ప్రిలిమినరీ పరీక్ష ఆగస్ట్‌ 7 , 8 తేదీల్లో నిర్వహించనుంది. ఇక గ్రూప్‌ 3 పరీక్ష ఈ ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది.

టీఎస్పీయస్సీ గ్రూప్-1,2,3 పోస్టుల రాత పరీక్షల తేదీలు ఇవే..

  • టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1కు ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన 563 పోస్టులకు నోటిఫికేషన్‌ ప్రకటించగా.. మార్చి 14వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తోంది. జూన్‌ 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో ప్రిలిమ్స్‌ పరీక్ష జరగనుంది. మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 150 నిమిషాల్లో సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్క్‌ ఉంటుంది. ప్రిలిమ్స్‌ అనంతరం అక్టోబర్ 21 నుంచి మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి.
  • టీఎస్పీయస్సీ గ్రూప్‌ 2కి 2022 డిసెంబర్‌ 29వ తేదీన 783 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు నియామక పరీక్ష ఆగస్టు 7, 8 తేదీల్లో జరుగుతుంది.
  • టీఎస్పీయస్సీ గ్రూప్‌ 3కి 2022 డిసెంబర్‌ 30వ తేదీన 1388 పోస్టులకు ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు నవంబర్‌ 17, 18 తేదీల్లో నియామక పరీక్ష జరుగుతుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి