TS 10th Class Hall tickets: గురువారం తెలంగాణ పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల.. మార్చి 18 నుంచి పరీక్షలు
తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సారానికి గానూ మార్చి 18 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన టెన్త్ హాల్‌టికెట్లను ఎస్‌ఎస్‌సీ బోర్డు గురువారం (మార్చి 7) విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షల నిర్వహణకు ఇప్పటికే టైం టేబుల్ కూడా బోర్డు ప్రకటించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పదో తరగతి..
హైదరాబాద్, మార్చి 6: తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సారానికి గానూ మార్చి 18 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన టెన్త్ హాల్‌టికెట్లను ఎస్‌ఎస్‌సీ బోర్డు గురువారం (మార్చి 7) విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షల నిర్వహణకు ఇప్పటికే టైం టేబుల్ కూడా బోర్డు ప్రకటించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ ఏడాది దాదాపు 5.07 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,700 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ పదోతరగతి 2024 పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ ఇదే..
- మార్చి 18, 2024వ తేదీన ఫస్ట్ ల్యాంగ్వేజ్
- మార్చి 19, 2024వ తేదీన సెకండ్ ల్యాంగ్వేజ్
- మార్చి 21, 2024వ తేదీన థార్డ్ ల్యాంగ్వేజ్
- మార్చి 23, 2024వ తేదీన మ్యాథమెటిక్స్
- మార్చి 26, 2024వ తేదీన ఫిజికల్ సైన్స్
- మార్చి 28, 2024వ తేదీన బయోలాజికల్ సైన్స్
- మార్చి 30, 2024వ తేదీన సోషల్ స్టడీస్
- ఏప్రిల్ 1, 2024వ ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1/ ఎస్సెస్సీ ఓకెషనల్ కోర్స్ (థియరీ)
- ఏప్రిల్ 2, 2024వ ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్)
తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్ష రుసుం గడువు పొడిగింపు
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ఆధ్వర్యంలో ఏప్రిల్/మేలో పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును పొడిగిస్తూ టాస్ ప్రకటన వెలువరించింది. రూ.50 అపరాధ రుసుంతో మార్చి 7వ తేదీ వరకు చెల్లించాలని తెలిపింది. మీసేవా/టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల్లో మాత్రమే ఫీజును చెల్లించాలని.. పరీక్షల ఫీజు, ఇతర వివరాలకు 80084 03631 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొంది.
ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్ ఫలితాలు విడుదల
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రాథమిక పరీక్ష నవంబర్ 18, 19 తేదీల్లో జరగగా.. డిసెంబర్ 31న మెయిన్స్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. మెయిన్స్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు త్వరలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టులు భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎంపికైన వారికి నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వరకు జీతంగా చెల్లిస్తారు.ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.