Underwater Metro Train: నీటి అడుగున తొలి మెట్రో రైలు ప్రారంభించిన మోదీ.. విద్యార్థులతో కలిసి ట్రయల్ రన్ జర్నీ
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దేశ వ్యాప్తంగా పలు మెట్రో ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. దీనిలో భాగంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో మార్గాన్ని బుధవారం ప్రధాన మోదీ ప్రారంభించారు. హౌరా మైదాన్ - ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న హుగ్లీ నది కింద ఈ టన్నెల్‌ను నిర్మించారు. హౌరా మెట్రో స్టేషన్ దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌గా రికార్డు సొంతం..
కోల్‌కతా, మార్చి 6: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దేశ వ్యాప్తంగా పలు మెట్రో ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. దీనిలో భాగంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో మార్గాన్ని బుధవారం ప్రధాన మోదీ ప్రారంభించారు. హౌరా మైదాన్ – ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న హుగ్లీ నది కింద ఈ టన్నెల్‌ను నిర్మించారు. హౌరా మెట్రో స్టేషన్ దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌గా రికార్డు సొంతం చేసుకుంది. ఈ కొత్త మెట్రో రూట్‌తో కోల్‌కతాలో రవాణా వ్యవస్థ మరింత సులభతరం కానుంది. కోల్‌కతాలో జరిగిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ప్రారంభ వేడుక అనంతరం మోదీ విద్యార్థులతో కలిసి తొలిసారి ఈ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విద్యార్ధులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఎస్‌ప్లనేడ్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. సుమారు రూ.120 కోట్ల వ్యయంతో 16.6 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ అండర్ వాటర్ మెట్రో రైలు మార్గం కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా – సాల్ట్ లేక్‌లను కలుపుతుంది. అండర్‌వాటర్ మెట్రో రైలులో మోదీతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, ఎమ్మెల్యే సువేందు అధికారి ప్రయాణించారు. అనంతరం మెట్రో సిబ్బందితో ప్రధాని మాట్లాడారు. వారు అండర్‌వాటర్ మెట్రో రైలు విశేషాలను మోదీకి వివరించారు. దీంతో పాటు కవి సుభాష్- హేమంత ముఖోపాధ్యాయ మెట్రో స్టేషన్, తరతాలా-మజేర్‌హట్ మెట్రో సెక్షన్‌లను కూడా ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించారు.
కాగా దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు కోల్‌కతా నగరంలోనే ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి మట్టానికి 32 మీటర్ల దిగువన హుగ్లీ నది క్రింద నిర్మించిన మెట్రోలో ఈ రోజు ట్రయల్ జర్నీ విజయ వంతంగా పూర్తి చేశారు. భూగర్భంలో 10.8 కిలోమీటర్ల లోతులో దీనిని నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్ – వెస్ట్ మెట్రో కారిడార్ కింద నిర్మించిన ఈ సొరంగ రైలు మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు. ఇందులో హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. దీనిని కేవలం 45 సెకన్ల వ్యవధిలో దాటొచ్చు.
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi travels with school students in India’s first underwater metro train in Kolkata. pic.twitter.com/95s42MNWUS
— ANI (@ANI) March 6, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.