Abortion Rights: అబార్షన్‌కు రాజ్యాంగ హక్కు కల్పించిన తొలిదేశంగా ఫ్రాన్స్‌ చారిత్రక ఘనత.. సంబరాలు చేసుకున్న మహిళలు

ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ సోమవారం (మార్చి 4) చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్‌ హక్కుకు రాజ్యాంగ హోదా కల్పించింది. దీంతో ప్రపంచంలోనే అబార్షన్ హక్కును రాజ్యాంగబద్దం చేసిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. జనవరిలో సెనెట్‌ ఆమోదం పొందిన ఈ బిల్లును సోమవారం ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్లెస్‌లో జరిగిన సమావేశంలో 780-72 అధిక మెజార్టీతో పార్లమెంటు ఆమోదించడంతో చట్ట రూపం దాల్చింది..

Abortion Rights: అబార్షన్‌కు రాజ్యాంగ హక్కు కల్పించిన తొలిదేశంగా ఫ్రాన్స్‌ చారిత్రక ఘనత.. సంబరాలు చేసుకున్న మహిళలు
Abortion Rights
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 05, 2024 | 6:25 PM

ప్యారిస్‌, మార్చి 5: ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ సోమవారం (మార్చి 4) చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్‌ హక్కుకు రాజ్యాంగ హోదా కల్పించింది. దీంతో ప్రపంచంలోనే అబార్షన్ హక్కును రాజ్యాంగబద్దం చేసిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. జనవరిలో సెనెట్‌ ఆమోదం పొందిన ఈ బిల్లును సోమవారం ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్లెస్‌లో జరిగిన సమావేశంలో 780-72 అధిక మెజార్టీతో పార్లమెంటు ఆమోదించడంతో చట్ట రూపం దాల్చింది. ఈ మేరకు ఫ్రెంచ్‌ రాజ్యాంగంలోని 34వ అధికరణను సవరించింది. దీంతో ఆ దేశంలో మహిళలు స్వేచ్ఛగా అబార్షన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లైంది.

కాగా 1975లో ఫ్రాన్స్‌లో అబార్షన్ చట్టబద్ధం చేశారు. అయితే ఇటీవల అమెరికాలో అబార్షన్‌ హక్కుకు ఉన్న రాజ్యాంగ రక్షణను అమెరికా సుప్రీంకోర్టు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ‘రో వర్సెస్‌ వేడ్‌’ కేసులో ఇచ్చిన తీర్సును కొట్టివేసిన సుప్రీంకోర్టు 23 వారాలలోపు వయసున్న గర్భస్థ పిండాన్ని అబార్షన్‌ ద్వారా తొలగించడం ఇకపై చట్టబద్దం కాదంటూ తీర్పు సందర్భంగా వెల్లడించింది. అమెరికాలో అబార్షన్‌ హక్కు రద్దైన తర్వాత.. దీనిని తిరుగులేని హక్కుగా మార్చేందుకు ఫ్రాన్స్‌ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

1974లో యగోస్లేవియా రాజ్యాంగంలో అబార్షన్‌ హక్కును పొందుపరిచినప్పటికీ.. రాజ్యాంగంలో ఇటువంటి వివరణ కలిగి ఉన్న ఏకైక దేశంగా ఫ్రాన్స్‌ నిలిచింది. కాగా 1958లో ఫ్రెంచ్‌ రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 17 సవరణలు మాత్రమే చేశారు. 2008 తర్వాత చేసిన తొలి రాజ్యాంగ సవరణ ఇదే కావడం విశేషం. అబార్షన్‌ హక్కుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడంతో మహిళా హక్కుల కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

సంప్రదాయవాదులు, తీవ్రవాద జాతీయ ర్యాలీ పార్టీతో సహా ఆధునిక ఫ్రెంచ్ పార్టీలు అబార్షన్ హక్కు కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. గతంలో కొందరు అబార్షన్‌ను రాజ్యాంగ హక్కుగా మార్చడానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీల వైఖరులు సాధారణంగా అక్కడి ఫ్రెంచ్ ప్రజల వైఖరికి అనుగుణంగా ఉంటాయి. అందుకే ఇటీవలి పోల్‌లో 80% కంటే ఎక్కువ మంది అబార్షన్ హక్కును సమర్థించినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.