Facebook and Insta down: ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులు.. ఏం జరిగిందో?

మెటా ప్లాట్ ఫామ్స్‌ అయిన ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులకు మంగళవారం (మార్చి 5) ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఈ సర్వీసులు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా స్తంభించి పోయాయి. డౌన్ డిటెక్టర్ ఆధారంగా, రియల్ టైమ్ అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ ప్రకారం.. ఈ రోజు రాత్రి 8:57 గంటలకు ఫేస్‌బుక్ డౌన్ అయినట్లు పేర్కొంది..

Facebook and Insta down: ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులు.. ఏం జరిగిందో?
Facebook
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 05, 2024 | 9:54 PM

ఢిల్లీ, మార్చి 5: మెటా ప్లాట్ ఫామ్స్‌ అయిన ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వీసులకు మంగళవారం (మార్చి 5) ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఈ సర్వీసులు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా స్తంభించి పోయాయి. డౌన్ డిటెక్టర్ ఆధారంగా, రియల్ టైమ్ అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ ప్రకారం.. ఈ రోజు రాత్రి 8:57 గంటలకు ఫేస్‌బుక్ డౌన్ అయినట్లు పేర్కొంది.

దీంతో భారత్‌ సహా పలు దేశాల్లో స్తంభించడంతో నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి లాగ్‌ అవుట్ అయ్యారు. తిరిగి లాగిన్‌ అయ్యే ఎంపిక లేకుండా లాగ్‌ అవుట్‌ అయినట్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో సాంకేతిక సాధనాలపై ఆధారపడిన కోట్ల మంది యూజర్లు.. ఎందుకిలా జరిగిందో అర్థంకాక నానా హైరానా పడుతున్నారు.

ఇప్పటి వరకు ఈ సర్వీసులు స్తంభించడానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా నేటి కాలంలో సోషల్‌ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లు ప్రజల నిత్యజీవితంలో భాగమై పోయాయి. తాజాగా ఈ సర్వీసులకు అంతరాయం ఏర్పడటంతో త్వరగా సర్వీసులు పునరుద్ధరించాలని కోరుతూ ఇతర సోషల్‌మీడియాల్లో పోస్టులు పెడుతూ యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. అసలు తమ ఒక్కరికే ఈ పరిస్థితి వచ్చిందా.. లేదా అందరికీ ఈ సర్వీసులు కట్‌ అయ్యాయా? తెలియక ఒకరినొకరు ఆరా తీస్తున్నారు. చాలా మంది వినియోగదారులు మెటా పరిధిలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌తో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పోస్టులు పెడుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్‌తో సహా ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయాయి. 2024లో ఇప్పటివరకు సోషల్‌ మీడియాకు సంభవించిన అతిపెద్ద అంతరాయం ఇదే కావడం గమనార్హం. సోషల్ మీడియా సర్వీసుల అంతరాయంపై ఇంకా మెటా సంస్థ స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.