UPI Services: యూపీఐ సేవలకు రుసుముల బాదుడు.. సంచలన సర్వేలో షాకింగ్ విషయాలు
2016లో భారతదేశంలో నోట్ల రద్దు సమయంలో యూపీఐ సేవలను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఈ సేవలు ప్రజా ఆదరణను పొందాయి. ముఖ్యంగా ఈ సేవలను పొందడానికి ఎలాంటి చార్జీలు లేకపోవడంతో యూపీఐ సేవలు తారాస్థాయికు చేరాయి. ఇటీవల లోకల్‌సర్కిల్స్ ఆన్‌లైన్ సర్వే ప్రకారం చాలా మంది వ్యక్తులు యూపీఐపై లావాదేవీ రుసుము విధించినట్లయితే దాన్ని ఉపయోగించడం మానేస్తారని వెల్లడైంది.

ప్రస్తుత రోజుల్లో భారతదేశం ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది. ఈ స్థాయిలో ఆన్‌లైన్ చెల్లింపులు పెరగడానికి ప్రధానం కారణం యూపీఐ సేవలు. 2016లో భారతదేశంలో నోట్ల రద్దు సమయంలో యూపీఐ సేవలను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఈ సేవలు ప్రజా ఆదరణను పొందాయి. ముఖ్యంగా ఈ సేవలను పొందడానికి ఎలాంటి చార్జీలు లేకపోవడంతో యూపీఐ సేవలు తారాస్థాయికు చేరాయి. ఇటీవల లోకల్‌సర్కిల్స్ ఆన్‌లైన్ సర్వే ప్రకారం చాలా మంది వ్యక్తులు యూపీఐపై లావాదేవీ రుసుము విధించినట్లయితే దాన్ని ఉపయోగించడం మానేస్తారని వెల్లడైంది. 364 జిల్లాల్లోని పౌరుల నుండి సర్వేకు 34,000 పైగా స్పందనలు అందాయని ఇందులో 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ తాజా సర్వే గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆగస్టు 2022లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వివిధ మొత్తాల బ్యాండ్‌ల ఆధారంగా యూపీఐ చెల్లింపులపై టైర్డ్ స్ట్రక్చర్ ఛార్జీని ప్రతిపాదిస్తూ చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఆర్‌బీఐ చర్చా పత్రాన్ని అనుసరించి, యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ లావాదేవీల రుసుములపై లోకల్ సర్కిల్స్ తన నివేదికలో పేర్కొంది.
సర్వే చేసిన యూపీఐ వినియోగదారుల్లో 23 శాతం మంది మాత్రమే చెల్లింపుపై లావాదేవీ రుసుమును భరించడానికి సిద్ధంగా ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది లావాదేవీ రుసుమును ప్రవేశపెడితే యూపీఐని ఉపయోగించడం మానేస్తామని సూచించినట్లు సర్వే తెలిపింది. యూపీఐ వినియోగానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ గురించి అడిగినప్పుడు ప్రతి 2 యూపీఐ వినియోగదారుల్లో 1 మంది ప్రతి నెలా 10కి పైగా లావాదేవీలు నిర్వహిస్తున్నారని సర్వే కనుగొంది. సర్వేలో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాల సంఖ్య మారుతూ ఉంటుంది. సర్వేలో పాల్గొన్న మొత్తం 37 శాతం మంది యూపీఐ వినియోగదారులు గత 12 నెలల్లో ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు తమ యూపీఐ చెల్లింపుపై లావాదేవీ రుసుము విధించినట్లు పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..








