Portable AC: క్షణాల్లో ఇల్లంతా చల్లదనం.. రూ. 799కే ఈ మినీ ఎయిర్ కూలర్..! ఓ లుక్కేయండి..
వేసవికాలం వచ్చేసింది.. భానుడి భగభగలకు జనాలు తాళలేకపోతున్నారు. వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్స్, కూలర్లకు పని చెబుతున్నారు జనాలు. అయితే అందరికీ ఎయిర్ కూలర్‌లు, ఏసీలు కొనే స్తోమత ఉండదు.
వేసవికాలం వచ్చేసింది.. భానుడి భగభగలకు జనాలు తాళలేకపోతున్నారు. వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్స్, కూలర్లకు పని చెబుతున్నారు జనాలు. అయితే అందరికీ ఎయిర్ కూలర్‌లు, ఏసీలు కొనే స్తోమత ఉండదు. మరి అలాంటప్పుడు మధ్యతరగతి ప్రజలకు.. తక్కువ ధరకే ఏసీలు దొరికితే బాగుండనిపిస్తుంది. ఈ క్రమంలోనే పలు బ్రాండెడ్ ఏసీ, కూలర్ కంపెనీలు తమ ఏసీ, ఎయిర్ కూలర్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. ఇలాంటి సమయంలో తక్కువ ధరకే ఓ చక్కటి ఎయిర్ కూలర్ మార్కెట్‌లోకి వచ్చేస్తే.. అంతకన్నా ఇంకేముంది.. ఠక్కున కొనేస్తారు జనాలు. మరి మీకోసం అలాంటిది ఒకటి తీసుకొచ్చేశాం. అదేంటో ఇప్పుడు చూసేద్దాం..
ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. ఓ మినీ పోర్టబుల్ ఎయిర్ కూలర్‌ను అందుబాటులో ఉంచింది. కేస్ ప్లస్ అలర్ట్ మినీ పోర్టబుల్ ఎయిర్ కూలర్ మోడల్ 3 అనే ఈ పోర్టబుల్ ఏసీ అసలు ధర 2499 కాగా.. 68 శాతం డిస్కౌంట్‌తో రూ. 799కే వస్తోంది. ఈ మినీ ఏసీ ఆఫీసులకు వెళ్లేవారికి, బయట ప్రాంతాలకు తిరిగేవారికీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ పోర్టబుల్ ఏసీ ఫ్యాన్‌కు 3 విండ్ స్పీడ్ అడ్జెస్ట్‌మెంట్ ఉంది. తద్వారా వేడిగాలిని.. చల్లగా, రిఫ్రెష్‌గా మారుస్తుంది. ఇందులో నుంచి సౌండ్ కూడా తక్కువగానే వస్తుండటంతో.. రాత్రి సుఖంగా నిద్రించవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీని మీరు ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. మరి మీకు ఈ మినీ కూలర్ కావాలంటే.. అమెజాన్ సైట్‌పై ఓ లుక్కేయండి.