AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులు సూపర్‌ న్యూస్‌.. ఇకపై జర్నీలో స్విగ్గీ ఫుడ్‌..

ఇకపై రైలు ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని, నచ్చిన రెస్టారెంట్‌ నుంచి ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎలాగైతే ఫుడ్‌ డెలివరీ యాప్‌లో బుక్‌ చేసుకుంటామో అలాగే రైలు జర్నీ సమయంలోనూ ఫుడ్‌ బుక్‌ చేసుకోవచ్చు. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా...

Indian Railways: రైల్వే ప్రయాణికులు సూపర్‌ న్యూస్‌.. ఇకపై జర్నీలో స్విగ్గీ ఫుడ్‌..
Swiggy
Narender Vaitla
|

Updated on: Mar 05, 2024 | 4:55 PM

Share

రైలు ప్రయాణం హ్యాపీగా ఉన్నా ఆహారంలో విషయంలోనే కాస్త ఇబ్బంది ఉంటుంది. నచ్చిన ఆహారం తినే అవకాశం ఉండదు. రైళ్లలో ఏ ఫుడ్‌ అమ్మొస్తో అదే తినాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ రైలు ప్రయాణించే ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌కు చెందిన ఫుడ్‌ని తినే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! అయితే ఇప్పుడు దీనిని అధికారులు నిజం చేస్తున్నారు.

ఇకపై రైలు ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని, నచ్చిన రెస్టారెంట్‌ నుంచి ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎలాగైతే ఫుడ్‌ డెలివరీ యాప్‌లో బుక్‌ చేసుకుంటామో అలాగే రైలు జర్నీ సమయంలోనూ ఫుడ్‌ బుక్‌ చేసుకోవచ్చు. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ, స్విగ్గీ మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం జరిగిన ఒప్పందం ప్రకారం.. మార్చి 12వ తేదీ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

తొలుత ఈ సేవలను విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్‌, బెంగళూరు స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవాలంటే స్విగ్గీలో కాకుండా ఐఆర్‌సీటీసీ యాప్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. యాప్లో ఎన్‌ఆర్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి కావాల్సిన ఆహారాన్ని కావాల్సిన స్టేషన్‌లో పొందొచ్చు. దీంతో ప్రయాణికులు మరింత మధురానుభూతి పొందుతారని ఐఆర్‌సీటీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు.

ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు స్విగ్గీ సీఈఓ రోహిత్‌ కపూర్‌ పేర్కొన్నారు. దీనివల్ల మరిన్ని స్టేషన్లకు సేవలు విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. రానున్న కొన్ని వారాల్లో మరో 59 స్టేషన్లలో ఈ సేవలను స్విగ్గీ ప్రారంభించనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?