CNG Bike: పెట్రోల్‌ కష్టాలకు ఇక చెక్‌.. త్వరలోనే మార్కెట్లోకి సీఎన్‌జీ బైకులు..

అవును ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్‌ త్వరలోనే సీఎన్‌జీ బైక్‌లను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగానే ప్రపంచంలో మొట్టమొదటి సీఎన్‌జీ బైకును తీసుకొచ్చే పనిలో పడింది. గతేడాది నుంచే ఇందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా కంపెనీ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఇందుకు...

CNG Bike: పెట్రోల్‌ కష్టాలకు ఇక చెక్‌.. త్వరలోనే మార్కెట్లోకి సీఎన్‌జీ బైకులు..
Bajaj Cng
Follow us

|

Updated on: Mar 05, 2024 | 6:29 PM

రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్‌ ధరలతో బైక్‌ బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే పెట్రోల్‌ సమస్యకు సీఎన్‌జీ చెక్‌ పెట్టిందని చెప్పాలి. పెట్రోల్‌తో పోల్చితే సీఎన్‌జీ ధర తక్కువగా ఉండడంతో వాహనదారులకు ఊరటలభించింది. అయితే సీఎన్‌జీ సదుపాయం కేవలం కార్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మరి సీఎన్‌జీ సపోర్ట్‌ చేసే బైక్‌లు కూడా ఉంటే భలే ఉంటుంది కదూ! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం కానుంది.

అవును ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్‌ త్వరలోనే సీఎన్‌జీ బైక్‌లను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగానే ప్రపంచంలో మొట్టమొదటి సీఎన్‌జీ బైకును తీసుకొచ్చే పనిలో పడింది. గతేడాది నుంచే ఇందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా కంపెనీ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. వచ్చే త్రైమాసికంలో సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

సీఎన్‌జీ బైక్‌లు అందుబాటులోకి వస్తే.. ఇంధన ధర, నిర్వహణ ఖర్చు 50-65 శాతం మేర తగ్గుతుందని రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. సంప్రదయ ఇంధన వాహనాలతో పోలిస్తే ఉద్గార స్థాయి తక్కువగా ఉంటుంది. సీఎన్‌జీ బైకుల వల్ల కార్బన్ డయాక్సైడ్ 50 శాతం, కార్బన్ మోనాక్సైడ్ 75 శాతం, నాన్-మీథేన్ హైడ్రోకార్బన్ ఉద్గారాల్లో దాదాపు 90 శాతం తగ్గుతాయని కంపెనీ చెబుతోంది.

ఇక సీఎన్‌జీ బైక్‌ను కేవలం ఒక్క వేరియంట్‌లోనే కాకుండా.. 100సీసీ నుంచి 160సీసీ వరకు అన్ని వేరియంట్లలో సీఎన్‌జీ బైకులను విడుదల చేస్తామని రాజీవ్ బజాజ్ వివరించారు. ప్రస్తుతానికి 125సీసీ సెగ్మెంట్‌పై కంపెనీ ఎక్కువ దృష్టి సారించింది. రానున్న రోజుల్లో దాదాపు ప్రతి 15 రోజులకు ఒక కొత్త బైకును విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.
మళ్లొస్తున్న మన్మధ.! 20 ఏళ్ళ తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్.
చిరుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్.! అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక.
చిరుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్.! అట్టహాసంగా ఐఫా అవార్డుల వేడుక.
వెంకటేశ్వరస్వామి చూస్తున్నాడు.భారీ మూల్యం చెల్లించుకుంటారు:ఖుష్బూ
వెంకటేశ్వరస్వామి చూస్తున్నాడు.భారీ మూల్యం చెల్లించుకుంటారు:ఖుష్బూ
వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.
వీడు మామూలోడు కాదు.! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష.
దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!
దేవర తొలి రోజు కలెక్షన్స్‌లో.. సగం NTR రెమ్యునరేషనే.!
జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ సుమలత..
జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ సుమలత..
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!
దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!
దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!
రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!
రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!