AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Rajguru: ఆ రూమర్స్ పై ‘సైరత్’ హీరోయిన్ క్లారిటీ.. వారికి ఇచ్చి పడేసిందిగా..

సైరత్ విడుదలైన ఏడేళ్లు పూర్తైన రింకు క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఈ బ్యూటీ ఎక్కడకు వెళ్లినా అభిమానులు భారీగా హజరవుతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే మహారాష్ట్రలోని జల్గావ్ లో జరిగిన మెగా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న రింకుకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్యలో చిక్కుకుంది రింకు.

Rinku Rajguru: ఆ రూమర్స్ పై 'సైరత్' హీరోయిన్ క్లారిటీ.. వారికి ఇచ్చి పడేసిందిగా..
Rinku Rajguru
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2024 | 4:16 PM

Share

2016లో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా ‘సైరత్’. మరాఠీలో ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ఈచిన్న సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో రింకు రాజ్‏గురు, ఆకాశ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ మూవీతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రింకు. సైరత్ విడుదలైన ఏడేళ్లు పూర్తైన రింకు క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఈ బ్యూటీ ఎక్కడకు వెళ్లినా అభిమానులు భారీగా హజరవుతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే మహారాష్ట్రలోని జల్గావ్ లో జరిగిన మెగా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న రింకుకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్యలో చిక్కుకుంది రింకు. అదే సమయంలో ఆమె కొందరు ఫ్యాన్స్ తోసేసారని.. దీంతో ఫ్యాన్స్ పై రింకు సీరియస్ అయ్యిందంటూ వార్తలు నెట్టింట ప్రచారమవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది రింకు.

“జల్గావ్‌లో జరిగిన ప్రోగ్రామ్‌పై నా అభిప్రాయం. ఇటీవల నేను ఒక ఈవెంట్ కోసం జలగావ్ వెళ్లాను. గుంపులో ఉన్న అభిమానులపై నేను అరిచినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వేదిక వద్ద అలాంటి ఘటనేమీ జరగలేదు కానీ నా చేయి లాగినందుకు ఓ ప్రతినిధితో మర్యాదపూర్వకంగా మాట్లాడాను. నా ప్రేక్షకులపై నాకు పూర్తి నమ్మకం, ప్రేమ ఉంది. నేను వారిని ఎప్పుడూ గౌరవిస్తాను. కాబట్టి దయచేసి ఇలాంటి వార్తలను ప్రచారం చేయకండి, ప్లీజ్ ” అంటూ సుధీర్ఘ పోస్ట్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది రింకు. ప్రస్తుతం రింకు షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

Rinku

Rinku

అసలు విషయానికి వస్తే.. జలగావ్ లో ప్రభుత్వం తరపున గొప్ప సాంస్కృతిక ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా నటి రింకు రాజ్ గురు హాజరయ్యింది. దీంతో ఈ వేడకుకు రింకును చూసేందుకు భారీగా జనాలు తరలివచ్చారు. అయితే అభిమానల మధ్య నుంచి బయటకు రావడం రింకుకు చాలా కష్టమైంది. అదే సమయంలో రింకును కొందరు అభిమానులు తోసేశారని.. మీ కూతురు ఈ ప్రదేశంలో ఉంటే ఇలాగే ప్రవర్తించేవారా ? అంటూ రింకు అభిమానుల పైకి అరిచిందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అలాగే రింకు అసహనం వ్యక్తం చేసిన వీడియోస్ కూడా నెట్టింట షేర్ చేశారు. దీంతో తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది రింకు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.