- Telugu News Photo Gallery Cinema photos Meenakshi chowdhary crazy offers with venkatesh and chiranjeevi
Meenakshi Chaudhary: వరసలో క్రేజీ ప్రాజెక్ట్స్.. బిజీ అవుతున్న మీనాక్షి చౌదరి
చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు ఓ యంగ్ బ్యూటీ. రీసెంట్‌గా సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీ అవుతున్నారు. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? హావ్ ఏ లుక్. గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసినా... ఇప్పుడు స్టార్ హీరోలతో జోడి కడుతూ స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
Updated on: Mar 06, 2024 | 4:04 PM

చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు ఓ యంగ్ బ్యూటీ. రీసెంట్‌గా సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీ అవుతున్నారు. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? హావ్ ఏ లుక్.

గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసినా... ఇప్పుడు స్టార్ హీరోలతో జోడి కడుతూ స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ, రీసెంట్‌గా మహేష్ బాబు గుంటూరు కారంలోనూ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించారు. ఈ సినిమాలు మంచి సక్సెస్ కావటంతో ఇప్పుడు మీనాక్షి డేట్స్ కోసం క్యూ కడుతున్నారు మేకర్స్.

ప్రజెంట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ మూవీతో పాటు వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, విశ్వక్‌సేన్ 10లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఇంత బిజీలోనూ ఓ సీనియర్ హీరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఫైనల్ చేసిందట టీమ్. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ బ్యూటీ పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫీల్ అవుతున్నారట మేకర్స్. మరి ఈ సినిమాలతో మీనాక్షి స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.




