AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hand Transplant: అద్భుతం కాదు అంతకుమించి.. మహిళా డోనర్ రెండు చేతులు పెయింటర్‌కు అమర్చిన వైద్యులు

వైద్య చరిత్రలో ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. రైలు ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్న ఓ పెయింట‌ర్‌కు మరో డోనర్‌ నుంచి సేకరించిన చేతులను విజయవంతంగా రెండు చేతులకు ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. త‌న రెండు చేతుల‌ను కోల్పోయి, జీవ‌నాధార‌మైన పెయింటింగ్ బ్రష్‌ను ప‌ట్టలేక‌పోయిన సదరు వ్యక్తి.. ఇప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్‌లో వైద్యులు చేసిన..

Hand Transplant: అద్భుతం కాదు అంతకుమించి.. మహిళా డోనర్ రెండు చేతులు పెయింటర్‌కు అమర్చిన వైద్యులు
Hand Transplant
Srilakshmi C
|

Updated on: Mar 06, 2024 | 6:32 PM

Share

న్యూఢిల్లీ, మార్చి 6: వైద్య చరిత్రలో ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. రైలు ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్న ఓ పెయింట‌ర్‌కు మరో డోనర్‌ నుంచి సేకరించిన చేతులను విజయవంతంగా రెండు చేతులకు ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. త‌న రెండు చేతుల‌ను కోల్పోయి, జీవ‌నాధార‌మైన పెయింటింగ్ బ్రష్‌ను ప‌ట్టలేక‌పోయిన సదరు వ్యక్తి.. ఇప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్‌లో వైద్యులు చేసిన ఈ అద్భుత శస్త్రచికిత్స వైద్య చరిత్రలోనే అరుదైన సృష్టిగా చెప్పవచ్చు. రెండు చేతులు ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్న 45 ఏళ్ల వ్యక్తి రేపు సర్‌ గంగారామ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కానున్నాడు.

కాగా 2020లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో అతడు రెండు చేతులు పోగొట్టుకున్నాడు. తాజాగా సౌత్ ఢిల్లీ స్కూల్‌లో ప‌నిచేస్తున్న మీనా మెహ‌తా అనే మహదిళ బ్రెయిన్ డెడ్ అయ్యింది. మరణానంతరం తన అవయావలను దానం చేస్తున్నట్లు ఆమె ముందుగానే ప్రకటించారు. ఆ ప్రకారంగా ఆమె డొనేట్‌ చేసిన కిడ్నీ, లివ‌ర్‌, కార్నియాల‌ను మ‌రో ముగ్గురికి అమర్చారు. ఆమె చేతులను ఢిల్లీ పెయింటర్‌కు అమ‌ర్చారు. 12 గంటలపాటు ఆపరేషన్‌ చేసిన వైద్యులు అత‌నికి రెండు చేతుల్ని విజయవంతంగా మార్పిడి చేశారు. దాత చేతులు, గ్రహీత చేతులు మధ్య ఉన్న ప్రతి నాళం, కండరం, స్నాయువు, నరాలను కలిపారు. డాక్టర్ల శ్రమ ఫలించి అతని రెండు చేతులు పని చేయడం మొదలుపెట్టాయి. తన చేతులతో థమ్సప్‌ సంకేతం చూపుతూ డాక్టర్తో ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చాడు. దీంతో మెడిక‌ల్ హిస్టరీలో ఇండియ‌న్ డాక్టర్లు సరికొత్త చ‌రిత్రను సృష్టించినట్లైంది.

ఫిబ్రవరి 2023లో ఉత్తర భారతదేశంలో ఉన్న సర్ గంగా రామ్ హాస్పిటల్ చేతి మార్పిడికి అనుమతి పొందిన మొదటి ఆసుపత్రిగా అవతరించింది. అప్పటి నుంచి చేతుల మార్పిడి కోసం సంభావ్యత ఉన్న వారి కోసం వెతుకుతున్నామని, ఢిల్లీ పెయింటర్‌ గురించి తెలిసిన తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ ప్రోటోకాల్స్ ప్రకారం అతనికి అన్ని వైద్య పరీక్షలు చేశామని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 19న ఆస్పత్రి వైద్య బృందం అతనికి ఆపరేషన్‌ నిర్వహించింది. కొన్ని రోజుల్లోనే అతను మునుపటి మాదిరిగా తన చేతులతో పెయింటింగ్‌ వేసుకోగలడని వారు మీడియాకు తెలిపారు. కాగా కొన్ని రోజుల క్రితం కాపర్‌ కాయిన్స్‌, అయస్కాంతం ముక్కలు మింగిన ఓ మానసిక రోగికి కూడా ఇదే ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్‌ చేశారు. రోగి కడుపులో నుంచి 39 నాణేలు మరియు 37 అయస్కాంతాలను తొలగించారు. అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తున్న సర్ గంగా రామ్ హాస్పిటల్ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.