NIA: అతడి ఆచూకీ చెబితే 10లక్షల రివార్డు.. ఎన్‌ఐఏ ప్రకటన
మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు ఘటన దేశం మొత్తాన్ని కంగారు పెట్టింది. వైట్‌ఫీల్డ్‌లోని కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడులో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు హోం శాఖ అప్పగించింది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో NIA సీరియస్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తోంది. దర్యాప్తు వేగవంతం చేసింది. దానిలో భాగంగా.. నిందితుడికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫొటోను విడుదల చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల నగదు రివార్డు అందజేస్తామని ప్రకటించారు. అయితే.. నిందితుడి సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తమను సంప్రదించేందుకు అడ్రస్‌తో పాటు ఫోన్ నంబర్ ఇచ్చారు.
NIA announces cash reward of 10 lakh rupees for information about bomber in Rameshwaram Cafe blast case of Bengaluru. Informants identity will be kept confidential. pic.twitter.com/F4kYophJFt
— NIA India (@NIA_India) March 6, 2024
ఈ నెల 1న బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులోని నిందితుడు.. ఏ రూట్‌లోకి కేఫ్‌లోకి వచ్చాడు?.. బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు?.. అతని వినియోగించిన వాహనం ఏంటి..? అనే అంశాలపై CCTV ఫుటేజ్ ఆధారంగా NIA అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేఫ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న బ్యాగును అక్కడపెట్టి హడావుడిగా వెళ్లినట్లు తేల్చారు. నిందితుడు బ్లాస్ట్ కోసం RDX ఉపయోగించాడని నిపుణులు తేల్చారు. దాంతో.. రామేశ్వరం కేఫ్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలోని 300 సీసీ కెమెరాల ఫుటేజ్‌ను విశ్లేషించారు NIA అధికారులు.
తెల్లటోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు NIA అధికారులు. బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లవ్స్ ధరించి ఉన్నట్లు నిర్ధారించారు. ఆ వ్యక్తినే ప్రధాన అనుమానితుడిగా తేల్చిన NIA అధికారులు.. అతని సమాచారం ఇచ్చిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఇక.. ఈ కేసులో ఇప్పటికే.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు NIA అధికారులు. కేంద్ర హోంశాఖ.. ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ( NIA)కు అప్పగించిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.