Salary Hike: దేశంలోని అన్ని ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు శుభవార్త.. ఈ ఏడాది జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?

ప్రస్తుతం రోజుల్లో ఖర్చులు పెరిగిపోయాయి. అన్ని వస్తువుల ధరలు సైతం పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా ఉద్యోగులు తమ జీతాల పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో కరోనా సమయంలో ఎన్నో ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగంలో ఉన్న చాలా మందికి జీతాల్లో సైతం కోత విధించాయి కంపెనీలు. కరోనా తర్వాత సంస్థలు మెల్లమెల్లగా పుంచుకున్నాయి. కరోనా తర్వాత కూడా గత ఏడాది కిందట చాలా కంపెనీలు తమ ఉద్యోగులను సైతం..

Salary Hike: దేశంలోని అన్ని ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు శుభవార్త.. ఈ ఏడాది జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?
Employees Salary
Follow us
Subhash Goud

|

Updated on: Mar 07, 2024 | 1:02 PM

ప్రస్తుతం రోజుల్లో ఖర్చులు పెరిగిపోయాయి. అన్ని వస్తువుల ధరలు సైతం పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా ఉద్యోగులు తమ జీతాల పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో కరోనా సమయంలో ఎన్నో ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగంలో ఉన్న చాలా మందికి జీతాల్లో సైతం కోత విధించాయి కంపెనీలు. కరోనా తర్వాత సంస్థలు మెల్లమెల్లగా పుంచుకున్నాయి. కరోనా తర్వాత కూడా గత ఏడాది కిందట చాలా కంపెనీలు తమ ఉద్యోగులను సైతం తొలగించాయి. ఇప్పుడు కూడా కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాలు పెంపుపై కూడా ప్రభావం పడింది. ఇప్పుడు ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో జీతాలో ఎంత పెరుగుతాయన్నది కొంత ఆందోళన చెందుతున్నారు.

ఏడాదిపాటు అవిశ్రాంతంగా శ్రమించిన అన్ని రంగాల కార్మికులు వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. ధరల పెరుగుదల ఏర్పాటు విధానం కారణంగా జీతం పెరగకపోతే, సమస్య ఉండవచ్చు. దేశంలోని ప్రైవేట్ సంస్థలు ఈ ఏడాది తమ జీతాలను పెంచుతాయా అనే ప్రశ్న చాలా మంది లేవనెత్తుతున్నారు. దేశంలోని కంపెనీలు 2024లో కార్మికుల వేతనాన్ని సగటున 9.6 శాతం పెంచే అవకాశం ఉందని, ఇది గత ఏడాది పెరుగుదలతో సమానమని ఒక అధ్యయనం చెబుతోంది. కన్సల్టెన్సీ సంస్థ EY నివేదిక ఈ నివేదికను తెలియజేసింది. మొత్తం ఉద్యోగుల తొలగింపు రేటు గతేడాది 21.2 శాతం నుంచి 18.3 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. రాబోయే కొన్నేళ్లలో ఇది మరింత తగ్గే అవకాశం ఉంది.

నివేదిక ప్రకారం, ఇ-కామర్స్ రంగం 2024లో అత్యధిక వేతన వృద్ధి 10.9 శాతంగా ఉంటుందని అంచనా. ఆ తర్వాత ఆర్థిక సేవల్లోని కార్మికుల జీతాలు 10.1 శాతం పెరగవచ్చు. వివిధ రంగాలకు చెందిన 80 సంస్థల నుంచి వచ్చిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ కంపెనీల్లో సగటు ఉద్యోగుల సంఖ్య 5,000-10,000 మధ్య ఉంటుంది. ఈవై ఇండియా ప్రకారం.. భారతీయ కంపెనీలలో మొత్తం సగటు జీతం, ఇ-కామర్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కొన్ని రంగాలలో గణనీయమైన జీతాలు పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి