AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే పాత ఇత్తడి వస్తువులు కొత్తవాటిలా మెరుస్తాయ్‌..! వంటగదిలో దాగున్న ఆ రహస్యం ఇదే..!!

రాగి బిందేలు, బాటిళ్లు, ఇత్తడి పాత్రలను త్వరగా ఎలా శుభ్రం చేయాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు.. అయితే, వంటగదిలో సులభంగా లభించే వస్తువులను ఉపయోగించి నిమిషాల్లో ఇత్తడి పాత్రలను శుభ్రం చేయవచ్చని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. అంతేకాదు..దాంతో మీ పాత ఇత్తడి సామాగ్రి కొత్త వాటిలా షైనింగ్‌ ఇచ్చే ఐదు సులభమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..

ఇలా చేస్తే పాత ఇత్తడి వస్తువులు కొత్తవాటిలా మెరుస్తాయ్‌..! వంటగదిలో దాగున్న ఆ రహస్యం ఇదే..!!
Brass Utensils
Jyothi Gadda
|

Updated on: Mar 06, 2024 | 2:14 PM

Share

పాత ఇత్తడి పాత్రలు, కంటైనర్లు ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. అయితే, వాడకం బాగానే ఉంది.. కానీ, వాటిని శుభ్రం చేయాలంటేనే తల ప్రాణం తోకలోకి వచ్చినట్టుగా మారుతుంది పరిస్థితి. రాగి బిందేలు, బాటిళ్లు, ఇత్తడి పాత్రలను త్వరగా ఎలా శుభ్రం చేయాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు.. అయితే, వంటగదిలో సులభంగా లభించే వస్తువులను ఉపయోగించి నిమిషాల్లో ఇత్తడి పాత్రలను శుభ్రం చేయవచ్చని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. అంతేకాదు..దాంతో మీ పాత ఇత్తడి సామాగ్రి కొత్త వాటిలా షైనింగ్‌ ఇచ్చే ఐదు సులభమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..

1. నిమ్మకాయ- ఉప్పు

నిమ్మకాయ, ఉప్పు అనేది మనం తరచుగా వంట పాత్రలను పాలిష్ చేయడానికి ఉపయోగించే వస్తువులు. కానీ ఈ వస్తువులను ఇత్తడి పాత్రలపై కూడా ఉపయోగించవచ్చు. నిమ్మకాయలోని పదార్థాలు వంట పాత్రలపై పడ్డ మరకలు, నలుపును తొలగించడంలో సహాయపడతాయి. కాబట్టి ఇత్తడి పాత్రలను శుభ్రం చేసేందుకు ముందుగా నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపై కొద్దిగా రాతి ఉప్పు వేయండి. ఇప్పుడు, ఈ నిమ్మకాయను ఉపయోగించి, ఇత్తడి పాత్రలను సున్నితంగా రుద్దండి. ఇత్తడి పాత్రలను స్క్రబ్ చేసిన తర్వాత, పాత్రలను నీటితో శుభ్రంగా కడగాలి. అంతే మెరుపు చూస్తారు.

ఇవి కూడా చదవండి

2. వెనిగర్ – పిండి

ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి పిండిని కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్‌లోని ఆమ్లత్వం పిండి సౌమ్యత ద్వారా సమతుల్యమవుతుంది. దీని కోసం, వెనిగర్-పిండి పేస్ట్ సిద్ధం చేయండి. దీని కోసం, ఒక గిన్నెలో వైట్ వెనిగర్, పిండిని సమాన భాగాలుగా కలపండి. దీంతో ఇత్తడి పాత్రలపై అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని పాత్ర అంతటా సమానంగా అప్లై చేయాలి. సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే పక్కన ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పాత్రలను కడగాలి. ఆ తర్వాత శుభ్రమైన పొడి క్లాత్‌తో తుడిచేసుకోవాలి. అంతే కొత్తవాటిలా కనిపిస్తాయి.

3. బేకింగ్ సోడా మరియు నిమ్మకాయ

వంటగది వస్తువులను శుభ్రం చేయడానికి రెండు అత్యంత ఉపయోగకరమైన పదార్థాలు నిమ్మకాయ, బేకింగ్ సోడా. తరచుగా ఇత్తడి పాత్రలపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. దీన్ని సులభంగా తొలగించడానికి మీరు బేకింగ్ సోడా, నిమ్మకాయలను ఉపయోగించవచ్చు. ఎలా చేయాలో చూద్దాం.

ముందుగా ఒక గిన్నెలో నిమ్మరసం, బేకింగ్ సోడా సమాన భాగాలుగా తీసుకోండి. రెండు పదార్థాలను మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు తయారుచేసిన ఈ పేస్ట్‌ను ఇత్తడి పాత్రలపై పేరుకుపోయిన మచ్చలపై అరగంట పాటు అప్లై చేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో పాత్రలను శుభ్రం చేసుకోవాలి. మీ పాత ఇత్తడి, రాగి పాత్రలు కొత్తవిగా మెరుస్తాయి.

4. టొమాటో సాస్

ఈ సొల్యూషన్ వింటే కచ్చితంగా చాలా మంది కళ్లలో మెరుపు ఖాయంగా వస్తుంది.. కానీ టొమాటో సాస్ కూడా ఇత్తడి సామాను తేలిక చేస్తుంది. దీని కోసం ఏం చేయాలంటే..ముందుగా, ఒక గుడ్డ లేదా స్పాంజిపై కొద్దిగా టొమాటో సాస్‌ను పూయాలి. ఆ తర్వాత దాంతో ఇత్తడి సామానుపై మెల్లగా, పాలిష్ లాగా రుద్దాలి. ఆ తర్వాత పొడి క్లాత్‌తో తుడిచేసుకోవాలి.

5. నూనె మరియు వెనిగర్

మీరు నూనె, వెనిగర్ ఉపయోగించి ఇత్తడి పాత్రలకు పాలిష్ చేయవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో సమాన మొత్తంలో నూనె, వెనిగర్ తీసుకోండి. ఈ రెండు పదార్థాలు బాగా కలిసే వరకు మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.. వెనిగర్, నూనె కలిపిన తర్వాత, మిశ్రమంలో మృదువైన గుడ్డను ముంచండి. ఇప్పుడు ఆ గుడ్డ సహాయంతో వెనిగర్, నూనె మిశ్రమాన్ని ఇత్తడి పాత్రలపై అప్లై చేయండి. పాత్రలపై పేరుకుపోయిన మొండి మరకలను తొలగించడానికి వెనిగర్ సహాయపడుతుంది.

ఈ సింపుల్ హోం రెమెడీస్‌తో ఇత్తడి పాత్రలను పాలిష్ చేయకుండానే కొత్త వాటిల మార్చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..