AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivaratri: ఆర్ధిక ఇబ్బందులా.. శివరాత్రి రోజున పేదలకు ఈ వస్తువులను దానం చేయండి..

2024లో మహాశివరాత్రి రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతోంది. సర్వార్థ సిద్ధి యోగం ఆర్థిక లాభం, పని సాఫల్యానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మాఘ మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి తిథిలో వచ్చే మహాశివరాత్రి రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..  

Maha Shivaratri: ఆర్ధిక ఇబ్బందులా.. శివరాత్రి రోజున పేదలకు ఈ వస్తువులను దానం చేయండి..
Maha Shivaratri 2024
Surya Kala
|

Updated on: Mar 08, 2024 | 12:39 PM

Share

మహా శివరాత్రి పండుగ సందడి దేశ వ్యాప్తంగా నెలకొంది. శివాలయాలు, శైవ క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. శివరాత్రి పర్వదినాన్ని ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. పురాణల మత గ్రంథాల ప్రకారం ఈ రోజు అర్ధ రాత్రి లింగోద్భవం జరిగిందని.. శివ పార్వతుల కళ్యాణం జరిగిందని విశ్వాసం. మహా శివరాత్రి రోజున తీసుకునే కొన్ని చర్యలు జీవితంలో అద్భుత మార్పులను తీసుకువస్తాయి. 2024లో మహాశివరాత్రి రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతోంది. సర్వార్థ సిద్ధి యోగం ఆర్థిక లాభం, పని సాఫల్యానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మాఘ మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి తిథిలో వచ్చే మహాశివరాత్రి రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..

మహా శివరాత్రి రోజున ఈ 4 వస్తువులు దానం చేయండి.

  1. నెయ్యి దానం చేయండి: మహా శివరాత్రి రోజున నెయ్యితో అభిషేకం వలన శివుడు ప్రసన్నుడవుతాడు. అంతే కాకుండా ఈ రోజున నెయ్యి దానం చేయడం ద్వారా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అలాగే  ఇంట్లో ఏ  రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగించబడుతుంది.
  2. పాలు దానం: మహా శివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే మహా శివరాత్రి రోజున పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతత పొందుతారని విశ్వాసం.
  3. నల్ల నువ్వులను దానం: మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి. నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు. పితృ దోషం కూడా తొలగిపోతుంది. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.
  4. బట్టలు దానం చేయండి: మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. రుణ విముక్తి లభిస్తుంది. శంకరుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

ఈ వస్తువులతో శివునికి అభిషేకం

  1. మహా శివరాత్రి రోజున శివుడిని పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం.
  2. తేనెతో అభిషేకం వలన భక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది.
  3. శివరాత్రి రోజున పెరుగుతో శంకరునికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
  4. శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.
  5. శివుని పూజ చేసే సమయంలో ‘ఓం పార్వతీపతయే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో దేనికీ లోటు ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ కిల్క్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?