Mahashivratri 2024: శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.. ఈ ఫుడ్స్ తినండి బెస్ట్!

మహా శివరాత్రి పండుగను భారతదేశంలోని హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శివరాత్రి వచ్చిందంటే.. శివాలయాలు అన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. మహా శివరాత్రిని కేవలం సామాన్య భక్తులే కాకుండా.. సెలబ్రిటీస్ సైతం జరుపుకుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటొలో, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. మహా శివరాత్రి వచ్చిందంటే.. రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రికి జాగరణ చేస్తారు. ఇలా చేయడం వల్ల..

Mahashivratri 2024: శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.. ఈ ఫుడ్స్ తినండి బెస్ట్!
Mahashivratri 2024
Follow us

|

Updated on: Mar 08, 2024 | 6:35 PM

మహా శివరాత్రి పండుగను భారతదేశంలోని హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శివరాత్రి వచ్చిందంటే.. శివాలయాలు అన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. మహా శివరాత్రిని కేవలం సామాన్య భక్తులే కాకుండా.. సెలబ్రిటీస్ సైతం జరుపుకుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటొలో, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. మహా శివరాత్రి వచ్చిందంటే.. రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రికి జాగరణ చేస్తారు. ఇలా చేయడం వల్ల.. శివుని అనుగ్రహం పొందుతారని భక్తుల విశ్వాసం. అయితే రోజంతా ఉపవాసం ఉండే భక్తులు.. రాత్రికి కాస్త పండ్లు, పాలు తీసుకుంటారు. అయితే కొంత మందికి తెలియకుండా.. ఏవి పడితే ఆ ఆహార పదార్థాలు తినేస్తారు. అలా అస్సలు తినకూడదు. చాలా మంది కఠిక ఉపవాసం ఉంటారు. అంటే కనీసం మంచినీళ్లు కూడా తాగరు. మరి కొంత మంది ఉండలేనివారు ఏం తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళ దుంప:

మీరు శివరాత్రి రోజు ఉపవాసం ఉండి.. ఆహార పదార్థాలను తీసుకోవాలి అనుకుంటే.. బంగాళ దుంపను తీసుకోవచ్చు. కానీ ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పసుపు వంటి ఆహారాలు మాత్రం తీసుకోకూడదు. ఈ బంగాళ దుంపల్లో మసాలాలకు సంబంధించిన ఆహారాలు కలపకుండా.. ఆలూ పకోడా, టిక్కీ వంటివి చేసుకుని తినవచ్చు.

కంద గడ్డ:

ఉపవాసం ఉండేవారు కంద గడ్డను కూడా తినొచ్చు. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి తినడం వల్ల నీరసం, అలసట అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఎనర్జిటిక్‌గా ఉంటారు. కంద గడ్డను ఉడికించి తీసుకోవచ్చు. లేదా మసాలాలు ఉపయోగించకుండా ఇంకెలా తీసుకున్నా పర్వాలేదు.

ఇవి కూడా చదవండి

పాలు:

ఉపవాసం ఉండే వారు పాలు, పాలతో తయారు చేసే జ్యూస్‌లు, పానీయాలు తాగవచ్చు. సేమియా, బాదం పాలు, సేమియా, ఫ్రూట్ కస్టర్డ్ వంటివి తీసుకోవచ్చు. వీటి వల్ల శరీరానికి శక్తి అనేది వస్తుంది.

ఈ చిరుతిళ్లు తినవచ్చు:

ఉపవాసం ఉండేవారు కొద్దిగా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు. వాటిలో ఈ చిరుతిళ్లు కూడా తీసుకోవచ్చట. బంగాళ దుంప పకోడీ, అరటి వడ వంటివి తీసుకోవచ్చట. అయితే వీటిల్లో ఉల్లిపాయ, పచ్చి మిర్చి, మసాలా దినుసులు ఉపయోగించ కూడదు. జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి యాలకులు, దాల్చిన చెక్క వంటివి ఉపయోగించవచ్చు. రాక్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు.

డ్రై ఫ్రూట్స్:

మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండే వారు డ్రై ఫ్రూట్స్, నీరు కలిపిన పానీయాలు, ఖర్జూరాలు, పలు రకాల పండ్లు, మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్స్ వంటివి తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల నీరసించి పోకుండా.. శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..