Maha Shivaratri Special Story: శివుడి నుంచి నేర్చుకోవాల్సిన 8 మేనేజ్మెంట్ పాఠాలు..
ఓం నమశ్శివాయ. చాలామంది రోజులో.. ఒక్కసారయినా భక్తితో ఆ శివుడి పేరును తలచుకుంటారు. కానీ మేనేజ్ మెంట్ గురు మాత్రం ఆ పరమేశ్వరుడిని గురువుగా భావిస్తాడు. అయినా లయకారుడు అయిన శివుడి నుంచి నేర్చుకోవాల్సిన మేనేజ్ మెంట్ పాఠాలు ఏముంటాయి? అన్న సందేహం రావచ్చు. నిజానికి లయకారుడు నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ వాటిలో ఎనిమిదింటి గురించి తెలిస్తే.. ఆయనను ఎందుకు అందరూ మేనేజ్ మెంట్ గురు అంటారో మీకు క్లియర్ గా అర్థమవుతుంది.
ఓం నమశ్శివాయ. చాలామంది రోజులో.. ఒక్కసారయినా భక్తితో ఆ శివుడి పేరును తలచుకుంటారు. కానీ మేనేజ్ మెంట్ గురు మాత్రం ఆ పరమేశ్వరుడిని గురువుగా భావిస్తాడు. అయినా లయకారుడు అయిన శివుడి నుంచి నేర్చుకోవాల్సిన మేనేజ్ మెంట్ పాఠాలు ఏముంటాయి? అన్న సందేహం రావచ్చు. నిజానికి లయకారుడు నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ వాటిలో ఎనిమిదింటి గురించి తెలిస్తే.. ఆయనను ఎందుకు అందరూ మేనేజ్ మెంట్ గురు అంటారో మీకు క్లియర్ గా అర్థమవుతుంది.
ప్రపంచంలో ఏది సులభం? పని చేయడమా? చేయించడమా? లేదా పనిని సమర్థవంతంగా చక్కబెట్టడమా? అంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. కానీ శివుడిని ఫాలో అయ్యేవారు మాత్రం.. మేనేజర్ గా చేయడం చాలా సులభమంటారు. ఆయన నుంచి 8 క్వాలిటీస్ ను నేర్చుకుంటే చాలు.. అటు ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ విజయం సాధించవచ్చు. ఇంతకీ ఏంటా 8 మేనేజ్ మెంట్ పాఠాలు? స్టార్టప్ ల సీజన్ నడుస్తున్న ఈ కాలంలో ఆధునిక మేనేజర్ లకు ఎదురయ్యే ప్రతీ సమస్యకు పరిష్కారమే వీటికి సమాధానం.
1.బ్యాలెన్స్..
పరమశివుడిని మహా యోగి అంటారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండే ఈశ్వరుడు ఈ విశ్వం మొత్తాన్నీ కంట్రోల్ చేస్తాడు. అదే సమయంలో తన కుటుంబం బాగోగులూ చూసుకుంటాడు. అంటే ఈ ఆధునిక కాలంలో మేనేజర్ లు కూడా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ను ఎలా బ్యాలెన్స్ చేయాలో లయకారుడిని చూసి నేర్చుకోవాలి. ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా.. ఒకదానికి ప్రయార్టీ ఇచ్చి మరోదానికి ఇవ్వకపోయినా సమస్యలు తప్పవు. అందుకే మేనేజర్ లు కూడా కెరీర్ తో పాటు కుటుంబానికీ ప్రాధాన్యతను ఇస్తూనే మంచి ఫలితాలు సాధించాలి.
2. ప్రాక్టీస్ ఛేంజ్ మేనేజ్ మెంట్..
శివుడిని మహేశ్వరుడిగా కొలుస్తారు. అంటే ఆయనలో రెండు గుణాలు ఉంటాయని అర్థం. క్రియేషన్, డిస్ట్రిక్షన్. విష్ణువు శక్తినిస్తే.. శివుడు లయకారుడిగా ఉంటాడు. ఈ రెండింటి కాంబినేషన్ తో మనకు కనిపిస్తాడు కాబట్టే పార్వతీపతిని మహేశ్వరుడిగా పిలుస్తారు. సో.. సంస్థలో ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇబ్బంది వస్తే.. మేనేజర్.. ఆ సమస్యను ఫేస్ చేయాలి. దానిని డీల్ చేయాలి. దాని వల్ల వచ్చే పర్యవసానాలను కూడా స్వీకరించాలి. అవసరమైన చోట.. ఛేంజ్ మేనేజ్ మెంట్ ప్రిన్సిపుల్ ను అమలు చేయాలి. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్ల ముళ్ల కంపలను తొలగించుకుంటూ వెళ్లాలి. అప్పుడే సక్సెస్ ఫుల్ మేనేజర్ అవుతారు.
3. సమానత్వంతో చూడడం..
సమానత్వంతో చూడకపోతే అసమానతలు పెరిగిపోతాయి. నిజం నిక్కచ్చిగా చెప్పాలంటే మన దేశంలో మహిళలకు చాలా రంగాల్లో సమానత్వం లేదు. ఇప్పటికీ మహిళల కంటే మగవారే బెస్ట్ మేనేజర్లుగా చెలామణి అవుతారు. కానీ శివుడిని చూడండి. తన జీవిత భాగస్వామి పార్వతికి తన దేహంలో, మనసులో అర్థభాగం ఇచ్చాడు.. అర్థనారీశ్వరుడయ్యాడు. పార్వతీ దేవిని ఆదిశక్తిగా పిలిచాడు. ఆదిశక్తి అంటే.. విశ్వంలో అన్నింటికీ ఆ తల్లే సుప్రీం అని అర్థం. కీలక నిర్ణయాల విషయంలో ఆమె సలహాలు తీసుకునేవాడు. అలాగే గుడ్ మేనేజర్ గా అవ్వాలంటే.. పురుషులను, మహిళలను అన్నింటా సమానంగా చూడాలి. పక్షపాతంతో వ్యవహరించకుండా ఉద్యోగులందరినీ సమానంగా ట్రీట్ చేయాలి.
4. ఆవిష్కరణ & సృజనాత్మకత..
క్షీరసాగర మథనంలో ఏం జరిగిందో చాలామందికి గుర్తుండే ఉంటుంది. హాలాహలం పుట్టినప్పుడు అది అంతటినీ నాశనం చేస్తుందని దేవతలంతా భయపడ్డారు. దీంతో అంతా ఆ హాలాహలాన్ని సేవించమని శివుడుని ప్రార్థించడంతో.. సకల సృష్టిని కాపాడడానికి ఆయన ఆ గరళాన్ని సేవించి దానిని తన కంఠంలో ఉంచుకుంటాడు. అంటే.. కష్టం, నష్టం ఎదురయ్యేటప్పుడు వాటికి ఎదురొడ్డి తానే భరించి.. విశ్వానికి మాత్రం అమృతాన్ని పంచాడు. అంతటి కష్టకాలంలో కూడా తెలివిగా ఆలోచించి.. ఎక్కడా ఎవరికీ నష్టం లేకుండా చేశాడు. ఇప్పుడు మేనేజర్ లు కూడా చేయాల్సింది అదే. కష్టమైన సందర్భాల్లోనూ సృజనాత్మకతతో కూడిన ఆవిష్కరణని మర్చిపోకూడదు. అప్పుడే పోటీదారులకన్నా ముందుండడం సాధ్యమవుతుంది.
5. టీమ్ కు నాయకత్వం..
క్షీరసాగర మథనంలో దేవతలతో పాటు రాక్షసులు కూడా పాల్గొంటేనే ఆ మథనం సాధ్యమైంది. అంటే అక్కడ టీమ్ వర్క్ చేస్తేనే అమృతం బయటకు వచ్చింది. ఈ విషయం శివుడికి బాగా తెలుసు. అందుకే వారితో టీమ్ వర్క్ ని చేయించాడు. అలాగే మేనేజర్ కూడా వ్యక్తిగత ఉత్పత్తి కన్నా.. టీమ్ అంతా కలిసి పనిచేసేలా వారిని ప్రేరేపించాలి.. ప్రోత్సహించాలి. అంతటి కష్టమైన పనిని శివుడు ఎలా హ్యాండిల్ చేశాడో చూశారుగా. అదే విధంగా మేనేజర్ కూడా అలాంటివాటిని తెలివిగా డీల్ చేస్తూ.. తన టీమ్ ను నడిపిస్తూ.. వారి నుంచి వీలైనంత ఎక్కువగా బెటర్ అవుట్ పుట్ ని తీసుకోవాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది.
6. బలమైన సంకల్పం..
పరమేశ్వరుడు తాను చేసే ప్రతీ పనిలో బలమైన సంకల్పంతో ఉంటాడు. అందుకే ఆయన మహాదేవుడయ్యాడు. ఒక మనిషి దృఢనిశ్చయంతో, బలమైన సంకల్పంతో ఒక పనిని చేస్తే.. కచ్చితంగా అందులో విజయం సాధిస్తాడు. మేనేజర్ కూడా శివుడి నుంచి ఈ క్వాలిటీని తీసుకోవాలి. ఎలాంటి కష్టకాలం వచ్చినా, సమస్యలు ఎదురైనా వాటిపై ఫోకస్ చేస్తూ.. బలమైన సంకల్పంతో వాటికి పరిష్కారం సాధించాలి. స్టార్టప్ లు రన్ చేసేవారు.. ముందుండి నడిపించే బాధ్యతను తీసుకోవాలి. శివుడిలా బలమైన సంకల్పం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
7. ఏకాగ్రత..
శివుడు ఎక్కువగా ధ్యానంలోనే ఉంటాడు. అందుకే ఆయన ఏ పనిలో అయినా చాలా శ్రద్దను చూపించగలుగుతాడు. మెడిటేషన్ చేయడం వల్లే.. ప్రశాంతతను, ఏకాగ్రతను సాధించగలిగాడు. ఈరోజుల్లో ఏ పని చేయాలన్నా దానికి ఫోకస్డ్ మైండ్ కచ్చితంగా కావాలి. అది కావాలంటే.. ధ్యానం చేయాలి. దీనివల్ల ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో ఉండే ఒత్తిడిని దూరంగా తరిమికొట్టొచ్చు. మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా కాన్సన్ ట్రేషన్ లెవల్స్ ని పెంచుకుంటే.. కష్టమైన సందర్భాలు ఎదురైనప్పుడు వాటిని చాలా సులభంగా హ్యాండిల్ చేసే మానసిక శక్తి వస్తుంది. ఈరోజుల్లో మేనేజర్ లకు కావాల్సింది ఇదే.
8. రిస్క్ ని తట్టుకునే సామర్థ్యం..
శివయ్యను రుద్ర అని పిలుస్తాం. దీనికి భయం లేనివాడు అని అర్థం. అలాగే అవసరమైనప్పుడు రిస్క్ ను కూడా ఫేస్ చేసేవాడు అని కూడా అంటారు. ఈశ్వరుడు ఎలాంటి పరిస్థితినైనా భయపడకుండా ఎదుర్కొంటాడు. అలాగే సంస్థలో మేనేజర్ కూడా రిస్క్ ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది అతనిలో మేనేజ్ మెంట్ స్కిల్స్ ను పెంచుతుంది. శివుడు ఎలాంటి ఉపద్రవాన్నీ సహించడు. మేనేజర్ కూడా సంస్థలో జరిగే న్యూసెన్స్ విషయంలో కఠినంగానే ఉండాలి. శివుడు తన భక్తుల నుంచి అపారమైన ప్రేమను, భక్తిని పొందుతాడు. మేనేజర్ కూడా తన తోటి ఉద్యోగుల నుంచి ప్రేమను, గౌరవాన్ని పొందాలి. ప్రతీ ఒక్కరి స్కిల్ ను అంచనా వేస్తూ.. వారితో అత్యుత్తుతమమైన ఫలితాలను సాధించేలా చేయాలి.
సో.. శివుడినిలో ఉన్న ఈ 8 ముఖ్యమైన మేనేజ్ మెంట్ స్కిల్స్ ను నేర్చుకోగలిగితే.. ఏ వ్యక్తి అయినా ది బెస్ట్ మేనేజర్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓం నమశ్శివాయ.
U.V.Gunneswara Rao