AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం బాగోలేదు..! కార్‌ షోరూమ్‌పై ఫిర్యాదు చేసిన బాలుడికి రిప్లై ఇచ్చిన ఆనంద్‌ మహీంద్రా..! నెటిజన్ల ప్రశంసలు..

గతంలోనూ ఆనంద్‌ మహీంద్రా ఒక ఆరేళ్ల కుర్రాడి వీడియోపై స్పందించారు. 70 రూపాయలకే ఎస్‌యూవీ వాహనం ఇస్తారా..? అంటూ అడిగిన బాలుడిని ఆ తర్వాత మహీంద్ర ఫ్యాక్టరీకి ఇన్వైట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. అక్కడ ఫ్యాక్టరీలో బాలుడు కార్ల తయారీ విభాగాలను చూసి ఆనందపడిన క్షణాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఆ బాలుడికి బుల్లి ఎస్ యూవీ బొమ్మ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.  వీడియో కూడా ప్రజల ప్రశంసలు అందుకుంది.

ఇదేం బాగోలేదు..! కార్‌ షోరూమ్‌పై ఫిర్యాదు చేసిన బాలుడికి రిప్లై ఇచ్చిన ఆనంద్‌ మహీంద్రా..! నెటిజన్ల ప్రశంసలు..
Anand Mahindra Reply To Little Boy
Jyothi Gadda
|

Updated on: Mar 08, 2024 | 1:12 PM

Share

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ ఉంటారు. అతను తరచుగా దేశంలోని యువత కోసం ప్రేరణాత్మక వీడియోలను షేర్‌ చేస్తుంటారు. అయితే ఈసారి ఓ చిన్న కుర్రాడి వీడియోను షేర్ చేశారు ఆనంద్‌ మహీంద్ర. మహీంద్రా షోరూమ్‌పై బాలుడు అతనికి ఫిర్యాదు చేశాడు. మీ షోరూమ్‌లో పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు లేవు..అంటూ ఆ బాలుడు చెప్పాడు. కొన్ని గంటల్లోనే అతడి వీడియో వైరల్‌గా మారింది. అంతటితో ఆగలేదు.. నేరుగా ఆనంద్ మహీంద్రాకు చేరింది. ఇప్పుడు ఈ అబ్బాయికి ఆనంద్‌ మహీంద్రా ఏం సమాధానం చెప్పారో మీరే చూడండి. ఈ సమాధానంతో నెటిజన్ల మనసు గెలుచుకున్నారు. నెటిజన్లతో ప్రశంసల వర్షం కురుస్తోంది.

కార్ షోరూమ్‌లో అన్ని సౌకర్యాలు పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వారికి కావాల్సిన టీ, కాఫీ, జ్యూస్‌ ఇస్తారు. కానీ పిల్లల గురించి ఎవరూ ఆలోచించరు. వారికి ఏమీ లేదు, ఎలాంటి ఏర్పాట్లు చేయాలని పట్టించుకోరు. అంటూ ఈ చిన్నారి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును ఆనంద్ మహీంద్రా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ అబ్బాయి చెప్పింది నిజమేనంటూ స్పందించారు.. కారు కొనేటప్పుడు పిల్లల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే షోరూమ్‌లో పిల్లలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ అబ్బాయి మాటలు విని మా బృందం పని చేయడం ప్రారంభించింది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోను 3 లక్షల మందికి పైగా నెటిజన్లు చూశారు. చాలా మంది ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

ఇవి కూడా చదవండి

గతంలోనూ ఆనంద్‌ మహీంద్రా ఒక ఆరేళ్ల కుర్రాడి వీడియోపై స్పందించారు. 70 రూపాయలకే ఎస్‌యూవీ వాహనం ఇస్తారా..? అంటూ అడిగిన బాలుడిని ఆ తర్వాత మహీంద్ర ఫ్యాక్టరీకి ఇన్వైట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. అక్కడ ఫ్యాక్టరీలో బాలుడు కార్ల తయారీ విభాగాలను చూసి ఆనందపడిన క్షణాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఆ బాలుడికి బుల్లి ఎస్ యూవీ బొమ్మ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.  వీడియో కూడా ప్రజల ప్రశంసలు అందుకుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..