AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bay Leaf Burn: బిర్యానీ ఆకును ఇంట్లో కాల్చి చూడండి.. జరిగే అద్భుతాలను నమ్మలేరు..! నిజమండోయ్..

బిర్యానీ ఆకులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలా మంది ఇది ఒక మసాలా అకుగానే భావిస్తారు. అయితే ఈ ఆకులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. బిర్యానీ ఆకులతో చేసిన టీ తాగడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనేక పరిశోధనలు చెప్పగా, దీన్ని తినడమే కాకుండా ఇంటిలోపల కాల్చడం, వాసన పీల్చడం వల్ల కూడా అనేక వ్యాధులు నయమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Bay Leaf Burn: బిర్యానీ ఆకును ఇంట్లో కాల్చి చూడండి.. జరిగే అద్భుతాలను నమ్మలేరు..! నిజమండోయ్..
Bay Leaf Burn
Jyothi Gadda
|

Updated on: Mar 08, 2024 | 10:36 AM

Share

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో వేలాది మొక్కలు ఉన్నాయి. ఇవి వివిధ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొన్ని రకాల మొక్కలను ఔషధ మొక్కలుగా సాంప్రదాయ వైద్యంతో పాటు ఇంగ్లీష్‌ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి ఉపయోగపడే లెక్కలేనన్ని లక్షణాలతో నిండిన అటువంటి అద్భుతమైన మొక్క బిర్యానీ ఆకు.. ఈ ఆకులు ఆహారం రుచిని పెంచడమే కాకుండా పోషకాలను కూడా పెంచుతాయి. బిర్యానీ ఆకులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలా మంది ఇది ఒక మసాలా అకుగానే భావిస్తారు. అయితే ఈ ఆకులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. బిర్యానీ ఆకులతో చేసిన టీ తాగడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనేక పరిశోధనలు చెప్పగా, దీన్ని తినడమే కాకుండా ఇంటిలోపల కాల్చడం, వాసన పీల్చడం వల్ల కూడా అనేక వ్యాధులు నయమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

బిర్యానీ ఆకు ప్రయోజనాలు ఏమిటంటే ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అందుకే దీనిని శతాబ్దాలుగా ప్రకృతి వైద్యంలో ఉపయోగిస్తున్నారు. సతత హరిత పొద అయిన లారెల్ మొక్క నుండి బిర్యానీ ఆకులు వస్తాయి. ఈ మూలిక ఆకులు నూనె, ఔషధాల తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం, బిర్యానీ ఆకులు వేడిని కలిగిస్తాయి. అందువల్ల కఫ, వాత దోషాలను తొలగిస్తుంది. అంతేకాదు..బిర్యానీ ఆకును కాల్చి ఆ వాసన పీల్చటం వల్ల మనస్సు ప్రశాంతత కలుగుతుంది. ఈ ఆకును బిర్యానీలో ఉపయోగించటం వలన బిర్యానీకి ఒక రకమైన రుచి, వాసన వస్తాయి.

రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకుని ఒక గదిలో కాల్చటం వల్ల వాటి నుంచి పొగ వ్యాపిస్తుంది. ఈ సమయంలో ఆ గది తలుపులు మూసివేయాలి. ఆ విధంగా ఒక 10 నిమిషాల పాటు తలుపులను మూసి ఉంచాలి. దాంతో ఆ పొగ గదిలో అంతటా బాగా వ్యాపిస్తుంది. ఆ తర్వాత గదిలో మంచి వాసన వస్తుంది. ఆ వాసనను పీల్చుకుంటే కూడా మంచిది. ఇలా చేస్తే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన అంతా మటుమాయం అవుతుంది. అంతేకాదు, మీ రూమ్‌ అంతా సువాసనా భరితంగా ఉంటుంది. దోమలు ఉంటే కూడా పారిపోతాయి.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. బిర్యానీ ఆకులతో నిద్రలేమి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. బిర్యానీ ఆకులు మీ శరీరానికి విశ్రాంతిని అందించడంలో సహాయపడతాయి. ఇవి మీ మెదడు పనితీరును శాంతపరచడం వల్ల నిద్రలేమిని దూరం చేస్తుంది. నిద్రపోయే ముందు మీ గదిలో నాలుగు బిర్యానీ ఆకులను కాల్చి వాసన పీల్చినా, లేదంటే, ఒక చెంబు నీళ్లల్లో రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి మరిగించి ఆ నీటిని తాగినా కూడా మంచి నిద్రకు దారితీస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..