AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆ దేవుడే దిక్కు..! విమానం గాల్లోకి ఎగరగానే టైర్‌ ఊడిపోయింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

విమానం టేకాఫ్ అవుతుండగా టైర్ ఊడిపోయి కిందకు పడిపోయింది.. విమానాశ్రయ పార్కింగ్‌ స్థలంలోకి దూసుకెళ్లింది టైర్‌. 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం ఎడమ వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్ అసెంబ్లీలో ఆరు టైర్లలో ఒకటి ఉన్నట్టుండి ఊడిపోవటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం టైర్‌ ఊడిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: ఆ దేవుడే దిక్కు..! విమానం గాల్లోకి ఎగరగానే టైర్‌ ఊడిపోయింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Airlines
Jyothi Gadda
|

Updated on: Mar 08, 2024 | 1:49 PM

Share

జపాన్‌కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జెట్‌లైనర్ గురువారం లాస్ ఏంజెల్స్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. జపాన్‌కు వెళ్లే బోయింగ్ 777 జెట్‌లైనర్ గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో నుండి టేకాఫ్ అవుతుండగా టైర్ ఊడిపోయి కిందకు పడిపోయింది.. విమానాశ్రయ పార్కింగ్‌ స్థలంలోకి దూసుకెళ్లింది టైర్‌. 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం ఎడమ వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్ అసెంబ్లీలో ఆరు టైర్లలో ఒకటి ఉన్నట్టుండి ఊడిపోవటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం టైర్‌ ఊడిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోని పార్కింగ్ స్థలంలో పడిపోయిన టైర్ వేగంగా దూసుకెళ్లింది. అక్కడ ఒక కారు అద్దం పగిలిపోయేలా చేసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే.. అక్కడ బోయింగ్ 777 ల్యాండింగ్ విషయంలో సమస్యలు వచ్చాయి. రన్‌వేలో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ విమానాన్ని తోసుకుంటూ, లాకెళ్లారని తెలిసింది.

ఇవి కూడా చదవండి

2002లో నిర్మించిన ఈ విమానం పాడైపోయిన టైర్లతో కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా రూపొందించినట్లు ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి తరలించినట్టుగా అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తదుపరి విచారణ జరుపుతున్నట్టుగా వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలుగలేదు. అంతా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..