నువ్వు కలియుగ కర్ణుడివి సామీ..! తన సంపాదన అంతా క్యాన్సర్ రోగులకు విరాళంగా ఇస్తున్న వ్యక్తి.. కారణం ఏమిటంటే
ప్రతి వ్యక్తి తన సంపాదనను పొదుపు చేయడంలో తద్వారా మూలధనాన్ని కూడబెట్టుకోవడంలో బిజీగా ఉన్న తరుణంలో.. మణిపూర్‌కు చెందిన వ్యక్తి వారానికి 6 రోజులు పని చేసి.. ఏడవ రోజున తన సంపాదన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేస్తున్నాడు. డబ్బుని అందునా తన కష్టర్జితాన్ని తృణపాయంగా భావిస్తున్న గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకుందాం.. సంపాదన అంతా ఇచ్చేస్తున్నాడు అంటే ఏదొక ఒక పెద్ద కంపెనీలో పని చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఆ కలియుగ దాన కర్ణుడు చెరకు రసం అమ్ముతున్నాడు.

ప్రస్తుతం మనిషికి డబ్బు జబ్బు పట్టుకుంది. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలి.. కూడబెట్టాలి అనే తాపత్రయం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. అవును ప్రతి వ్యక్తి తన సంపాదనను పొదుపు చేయడంలో తద్వారా మూలధనాన్ని కూడబెట్టుకోవడంలో బిజీగా ఉన్న తరుణంలో.. మణిపూర్‌కు చెందిన వ్యక్తి వారానికి 6 రోజులు పని చేసి.. ఏడవ రోజున తన సంపాదన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేస్తున్నాడు. డబ్బుని అందునా తన కష్టర్జితాన్ని తృణపాయంగా భావిస్తున్న గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు తెలుసుకుందాం.. సంపాదన అంతా ఇచ్చేస్తున్నాడు అంటే ఏదొక ఒక పెద్ద కంపెనీలో పని చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఆ కలియుగ దాన కర్ణుడు చెరకు రసం అమ్ముతున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
క్యాన్సర్ రోగికి సహాయం
మణిపూర్‌లోని ఇంఫాల్‌లో నివాసముంటున్న లాంగ్‌జామ్ లోకేంద్ర సింగ్ చెరుకు రసం విక్రయిస్తున్నాడు. 49 ఏళ్ల లాంగ్‌జామ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరకు రసాన్ని అమ్ముతాడు. అలా జ్యూస్ అమ్ముతూ వారమంతా సంపాదిస్తాడు. ఈ డబ్బుని ఖర్చు పెట్టకుండా.. ఆ తర్వాత వచ్చే శుక్రవారం రోజున తన సంపాదనలో ప్రతి రూపాయిని క్యాన్సర్ రోగులకు విరాళంగా అందిస్తున్నాడు.
వాస్తవానికి ఇతరులకు సహాయం చేస్తున్న లాంగ్‌జామ్ కు ఈ చర్యల వెనుక ఓ రీజన్ ఉంది. తన చర్య వెనుక కారణాన్ని వివరిస్తూ తన భార్య 2013 సంవత్సరంలో క్యాన్సర్‌తో మరణించిందని చెప్పాడు. ఆ తర్వాత క్యాన్సర్ పేషెంట్లకు సాయం చేయాలని తాను నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి .. తన సంపాదనను క్యాన్సర్ రోగులకు విరాళంగా ఇస్తున్నాడు.
#WATCH Imphal, Manipur: Lokendra Longjam, 49, a sugarcane juice seller, donates every penny he earns to cancer patients.
He says, “Unfortunately, my wife was suffering from colon cancer till 2013…I am a farmer… I sold all my property and I took my wife to Tata Cancer… pic.twitter.com/uw1WABoNXG
— ANI (@ANI) March 8, 2024
భార్య వైద్యానికి డబ్బులు లేని పరిస్థితి
లాంగ్‌జామ్ లోకేంద్ర సింగ్ తన సంపాదనను విరాళంగా ఇవ్వడానికి గల కారణాన్ని వివరిస్తూ… తన భార్య 2013లో క్యాన్సర్‌తో మరణించిందని చెప్పాడు. ఆ సమయంలో తన భార్యకు వైద్యం చేయించుకోవడానికి సరిపడా డబ్బు లేదు. భార్య చికిత్స సమయంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో తన భార్య క్యాన్సర్‌తో మరణించింది. “దురదృష్టవశాత్తు.. నా భార్య 2013లో పెద్దప్రేగు క్యాన్సర్‌తో బాధపడింది. నేను సాధారణ రైతును.. అయినప్పటికీ భార్యను బతికించుకోవాలని.. చికిత్స ఇప్పించడానికి తన ఆస్తి మొత్తాన్ని అమ్మి, ఆమెను చికిత్స కోసం ముంబైలోని టాటా క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పాడు. ఆ సమయంలో ఎన్నో ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రీట్‌మెంట్ సమయంలోనే క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి కోసం తప్పకుండా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నానని చెబుతున్నాడు. మనిషిలో మానవత్వం ఇంకా మిగిలి ఉందని చాటి చెబుతున్నాడు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




