Wedding Industry: వెడ్ ఇన్ ఇండియా జోరు.. పెళ్లి వేడుకలపై ఒక్క సీజన్‌లోనే లక్షల కోట్ల బిజినెస్..!
పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఓ మధుర ఘట్టం. మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసే మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని నేటి యువతీయువకులు కలలు కంటుంటారు. తల్లిదండ్రులు కూడా ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంతపీట వేసి తమ పిల్లల పెళ్లి వేడుకను తమ స్థోమతకు తగ్గట్టు అట్టహాసంగా చేయాలని ఆరాటపడుతుంటారు.

పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఓ మధుర ఘట్టం. మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసే మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని నేటి యువతీయువకులు కలలు కంటుంటారు. తల్లిదండ్రులు కూడా ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంతపీట వేసి తమ పిల్లల పెళ్లి వేడుకను తమ స్థోమతకు తగ్గట్టు అట్టహాసంగా చేయాలని ఆరాటపడుతుంటారు. పిల్లల కాపురం పది కాలాల పాటూ పచ్చగా ఉన్నట్లే.. పెళ్లి వేడుకలూ తరాల పాటూ గుర్తుండిపోవాలని కోరుకుంటారు. కరోనా సీజన్‌లో పెళ్లి వేడుకల జోరు కాస్త తగ్గినా.. గత రెండేళ్లుగా మళ్లీ జోరందుకున్నాయి. అయితే వివాహ ఖర్చులు అంచనాలను మించి ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా కష్ట కాలాన్ని అధిగమించి ఇప్పుడు భారత్‌లో పెళ్లి వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతోంది. ఈ వ్యాపారంలో ఉన్న వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. 42 లక్షల పెళ్లిళ్లు.. రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారం ప్రస్తుత మ్యారేజ్ సీజన్ లో దేశవ్యాప్తంగా 42 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. శుభ ముహూర్తాలు ఉండటంతో పెళ్లి సందళ్లు కనువిందు చేయనున్నాయి. కల్యాణ మండపాలు కళకళలాడనున్నాయి..ఫంక్షన్ హాల్స్, బంగారం దుకాణాలు సందడి చేయనున్నాయి. దీంతో జనవరి 15 నుంచి మొదలైన ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశముంది. దేశ వ్యాప్తంగా 30 ప్రధాన నగరాలలో జులై 15 వరకు జరిగే మ్యారేజెస్‌ను పరిగణలోకి తీసుకుని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్...




