Ola Offers: ఓలా ఉమెన్స్ డే ఆఫర్లు.. ఏకంగా రూ. 27వేల వరకూ డిస్కౌంట్.. రేపటితో లాస్ట్..
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి బ్రాండ్లు తమ సత్తా చాటుతున్నాయి. పలు రకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై మహిళలకు పలు ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు మార్చి 8వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి బ్రాండ్లు తమ సత్తా చాటుతున్నాయి. పలు రకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై మహిళలకు పలు ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు మార్చి 8వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆఫర్ వివరాలు ఇవి..
ఓలా ఎలక్ట్రిక్ ఉమెన్స్ డే ఆఫర్లలో భాగంగా ఓలా ఎస్1, ఎస్1 ఎయిర్, ఎస్1 ఎక్స్, ఎస్1 ఎక్స్ ప్లస్, ఎస్1 ప్రో స్కూటర్లపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. నగదు తగ్గింపు రూ. 25,000 ఉంటుంది. దీంతో పాటు మహిళలకు అదనపు మరో రూ, 2000 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాక పాత పెట్రోల్ వాహనాలను కూడా ఎక్స్ చేంజ్ చేసుకునే వెసులుబాటును కూడా అందిస్తుంది.
ధరలు ఇలా..
- ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ధర రూ. 84,999గా ఉంటుంది. ఓలా ఎస్1 ప్రో రూ. 1.30లక్షల నుంచి ఎస్1 ఎయిర్ ధర రూ. 1.05లక్షలు ఉంటుంది. ఈ ధరలన్నీ ఎక్స్ షోరూమ్ వే. ఈ స్పెషల్ డిస్కౌంట్లు, ఆఫర్లలో దాదాపు అన్ని మార్చి నెలాఖరు వరకూ అందుబాటులో ఉంటాయి.
- ఓలా ఎస్1 ఎక్స్(4కేడబ్ల్యూహెచ్) ధర రూ. 1,09,999, ఎస్1ఎక్స్(2కేడబ్ల్యూహెచ్) ధర రూ. 79,999, ఎస్1 ఎక్స్(3కేడబ్ల్యూహెచ్) ధర రూ. 89,999గా ఉంది. ఈ ధరలన్నీ ఎక్స్ షోరూం ఉంటాయి. బ్యాటరీపై కంపెనీ ఎక్స్ టెండెడ్ వారంటీని కూడా అందిస్తుంది. స్కూటర్ కొన్నాక మొదటి ఎనిమిది సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటరలకు వరకూ ఉచితంగా బ్యాటరీ వారంటీ పొందుతారు. అంతేకాక యాడ్ ఆన్ వారంటీని కూడా పొందుకుంటారు. రూ. 4,999 ధరతో 1,25,000కిలోమీటర్ల వరకూ వారంటీని పొందుకోవచ్చు.
ఓలా భవిష్యత్తు ప్లాన్లు ఇవే..
ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్ వర్క్ ను 50శాతం పెంచుకోవాలని ప్లాన్ చేస్తోది. ప్రస్తుతం 414 సర్వీస్ సెంటర్లను వచ్చే 2024 ఏప్రిల్ నాటికి 600 సెంటర్లకు పెంచాలని లక్ష్యంగా చేసుకుంది. కాగా ఓలా 2023 ఫిబ్రవరిలో 35,000 యూనిట్లకు రిజస్ట్రేషన్ అయినట్లు ప్రకటించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక నెలలో రిజిస్టర్ అయిన స్కూటర్లలో ఇవే అత్యధికమని కంపెనీ పేర్కొంది. కాగా గత మూడు నెలల్లో దాదాపు ఒక లక్ష వరకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఓలా పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..