MG Comet EV: ఇక చార్జింగ్ సమస్యలకు చెక్.. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో కొత్త ఎంజీ కామెట్ వచ్చేసింది..

గతేడాది బుల్లి ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ అయిన ఎంజీ కామెట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అత్యాధునిక ఫీచర్లతో దీనిని ఎంజీ మోటార్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు దీనిని అప్ గ్రేడ్ చేస్తూ ప్రత్యేక ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఎంజీ కామెట్ ఈవీ కారు మార్కెట్ లోకి విడుదల చేసింది. మరిన్ని ఆధునిక ఫీచర్లతో దీనిని రూపొందించారు. ఈ వివరాలు మీ కోసమే..

MG Comet EV: ఇక చార్జింగ్ సమస్యలకు చెక్.. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో కొత్త ఎంజీ కామెట్ వచ్చేసింది..
Mg Comet Ev
Follow us
Madhu

|

Updated on: Mar 09, 2024 | 5:38 PM

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. పర్యావరణానికి ఏ మాత్రం నష్టం కలిగించని ఇలాంటి వాహనాలపై వినియోగదారులకు ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్ లు రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. వీటిలోనే కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది బుల్లి ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ అయిన ఎంజీ కామెట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అత్యాధునిక ఫీచర్లతో దీనిని ఎంజీ మోటార్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు దీనిని అప్ గ్రేడ్ చేస్తూ ప్రత్యేక ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఎంజీ కామెట్ ఈవీ కారు మార్కెట్ లోకి విడుదల చేసింది. మరిన్ని ఆధునిక ఫీచర్లతో దీనిని రూపొందించారు. ఈ వివరాలు మీ కోసమే..

ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ..

ప్రత్యేక ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో ఎంజీ కామెట్ ఈవీ కారు మార్కెట్ లోకి విడుదలైంది. రెండు కొత్త వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి ఉంది. ఈ కారు ధరలు రూ. 8.24 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. వీటిలో బేస్ ఎగ్జిక్యూటివ్ ట్రిమ్ రూ. 6.99 లక్షలు, మిడ్ ఎగ్జైట్ రూ. 7.88 లక్షలు, అందులో ఫాస్ట్ చార్జింగ్ వెర్షన్ కావాలంటే 8.24 లక్షలు, ఎక్స్‌క్లూజివ్ రూ. 8.78 లక్షలు, అందులో ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే 9.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్లను 7.4 కేడబ్ల్యూ ఏసీ చార్జర్ తో వేగవంతంగా చార్జింగ్ అయ్యే లా తయారు చేశారు. అయితే ఎంత సమయం చార్జింగ్ పెట్టాలనే విషయాన్ని కంపెనీ వివరించలేదు. గతంలో కామెట్ కు 3.3 కేడబ్ల్యూ ఏసీ చార్జర్ మాత్రమే ఉండేది. దీనిద్వారా బ్యాక్టరీని పూర్తిగా చార్జింగ్ చేయడానికి ఏడు గంటల సమయం పట్టేది.

రెండు కొత్త వేరియంట్లు..

ఫాస్ట్ చార్జింగ్ ప్రత్యేకతతో ఎంజీ కామెట్ ఈవీని విడుదల చేస్తున్నట్లు ఎంపీ మోటార్ ఇండియా కంపెనీ ప్రకటించింది. అలాగే రెండు కొత్త వేరియంట్లలో అత్యుత్తమ ఫీచర్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. కామెట్ ఈవీ ధరలు ఇప్పుడు రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.14 లక్షల వరకూ పలుకుతున్నాయి.

ఇవి కూడా చదవండి

గతంలో ఇలా..

అంతకు ముందు కామెట్ ఈవీ పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటిని ఇప్పుడు ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్‌ పేరుతో భర్తీ చేశారు. వీటిలో ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ వెర్షన్లు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ట్రిమ్ కంటే రూ. 20 వేలు ఎక్కువ. ఇక ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ (గతంలో పేస్, ప్లే అని పిలిచేవారు)ల ధరలు మాత్రం మారవు.

మరికొన్ని ప్రత్యేకతలు..

ఎక్సైట్ తో పాటు ఎక్స్‌క్లూజివ్ ప్రత్యేకమైన ఫాస్ట్ ఛార్జింగ్ ట్రిమ్‌లు ఇప్పుడు వెనుక డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఈఎస్సీ, పవర్ ఫోల్డబుల్ ఓఆర్ వీఎం, టర్న్ ఇండికేటర్ ఇంటిగ్రేటెడ్ డీఆర్ ఎల్ లు, క్రీప్ మోడ్ వంటి అదనపు ఫీచర్ల కూడా ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ట్విన్ 10.25 అంగుళాల స్క్రీన్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, మూడు యూఎస్ బీ పోర్ట్‌లు కనెక్ట్ చేసిన కార్ టెక్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే భద్రత పరంగా కొన్ని ప్రత్యేకతలను రూపొందించారు. ఏబీ ఎస్, ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), సెన్సార్‌లతో కూడిన రివర్స్ కెమెరా, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

బ్యాటరీ గురించి..

బ్యాటరీ, పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. కామెట్ 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేశారు. ఇది 42 హెచ్ పీ శక్తిని, 110 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. బ్యాటరీ నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీ67-రేట్ చేశారు. ఏఆర్ ఏఐ ధ్రువీకరించిన 230 కేఎమ్ పరిధిని పొందుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?