Holi 2024: ఈ గ్రామాల్లో హొలీ సంబరాలు అంటే భయం భయం.. దశాబ్దాలుగా రంగులకి దూరం.. రీజన్ ఏమిటంటే..

శివ రాత్రి సందడి అయిపొయింది... ఇప్పుడు రంగుల పండుగ హోలీ సందడి మొదలు కానుంది.  దేశవ్యాప్తంగా హొలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఉత్తరాఖండ్‌లో హోలీ ఆడని మూడు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఇంతకు ముందు ఎవరైనా హోలీ ఆడేందుకు ప్రయత్నిస్తే అకాల మృత్యువాత పడ్డారట.. దీంతో ఆ గ్రామీణ ప్రజలు మళ్లీ హోలీ ఆడేందుకు ధైర్యం చేయకపోవడంతో అప్పటి నుంచి నేటి వరకు హొలీ నిషేధం అనేది సంప్రదాయం కొనసాగుతోంది.

Holi 2024: ఈ గ్రామాల్లో హొలీ సంబరాలు అంటే భయం భయం.. దశాబ్దాలుగా రంగులకి దూరం.. రీజన్ ఏమిటంటే..
Holi Colour FestivalImage Credit source: Getty Images
Follow us
Surya Kala

| Edited By: TV9 Telugu

Updated on: Mar 12, 2024 | 5:43 PM

రంగుల పండుగ హోలీని దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారు. ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల వారు మాత్రం హొలీ వేడుకలకు దూరంగా ఉంటారు. ఈ గ్రామాల్లో హోలీ రంగులు అడుగు పెట్టవు. నేటికీ ఈ గ్రామాలలో హోలీ రంగులు అశుభమైనవిగా పరిగణించబడుతున్నాయి. హోలీ జరుపుకోవడం వల్ల దేవుడికి కోపం వస్తుందని ఆ ఊరి ప్రజల నమ్మకం. అయితే ఈ నమ్మకం ఎందుకు కలిగిందో ఈ రోజు తెలుసుకుందాం.

ఈ గ్రామాల్లో హోలీ ఆడరు

రుద్రప్రయాగ్ జిల్లాలో క్వేలి, కుర్జాన్ , జోండ్ల అనే మూడు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఇప్పటివరకు హోలీ ఆడలేదు. హోలీని జరుపుకోకపోవడానికి కారణం భూమ్యాల్ దేవుడు, కులదేవి ఇచ్చిన శాపం కారణంగా హొలీ ఆడరని విశ్వాసం. ఇక్కడి గ్రామ దేవత భూమ్యాల్ దేవి. కుల దేవతలుగా నంద దేవి, త్రిపుర సుందరి.

ఇవి కూడా చదవండి

గ్రామంలో ఎవరైనా హోలీ జరుపుకుంటే భూమ్యాల్ దేవతలకు కోపం వస్తుందని ఒక నమ్మకం. ఇలా చేయడం వల్ల గ్రామంలోని మనుషులకు, జంతువులకు వ్యాధి వ్యాపించి అకాల మరణానికి గురవుతున్నారని విశ్వాసం. చాలా సంవత్సరాల క్రితం గ్రామస్తులు హోలీని జరుపుకోవడానికి ప్రయత్నించారని.. అయితే అప్పుడు గ్రామంలో కలరా అనే వ్యాధి వ్యాపించి చాలా మంది మరణించారని చెబుతారు.

హోలీ ఎందుకు ఆడకూడదంటే ?

రుద్రప్రయాగ్‌లోని అగస్త్యముని బ్లాక్‌లోని తల్లనాగ్‌పూర్ బెల్ట్‌లోని క్విలీ, కుర్జాన్ , జోండ్ల గ్రామాలు హోలీ ఉత్సాహం , సందడి నుండి దూరంగా ఉన్నాయి. ఇక్కడి ప్రజలు హోలీ ఆడరు అంతేకాదు కనీసం  ఒకరిపై ఒకరు రంగులు జల్లుకోరు. 350 ఏళ్ల క్రితం ఇక్కడ హోలీ ఆడేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే.. అకాల మరణం చవిచూడాల్సి వచ్చిందని చెబుతారు. ఈ ఘటన రెండుసార్లు జరిగిన తర్వాత మూడోసారి కూడా హోలీ ఆడేందుకు ఎవరూ సాహసించలేదు. ఈ గ్రామాల ప్రజలు హోలీని జరుపుకోవాలని కోరుకుంటారు. అయితే హోలీ ఆడిన తర్వాత వ్యాధి వ్యాప్తి చెందుతుందనే పుకార్లకు భయపడతారు.

గ్రామస్తులు ఏమంటున్నారు?

రుద్రప్రయాగ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్విలీ, కుర్జాన్ , జౌండ్ల గ్రామాలు సుమారు 350 సంవత్సరాల క్రితం స్థిరపడ్డాయి. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కొన్ని పూజారి కుటుంబాలు తమ జాజ్‌మాన్‌లు , రైతులతో కలిసి ఇక్కడ స్థిరపడ్డాయని ఇక్కడి గ్రామస్తులు నమ్ముతారు. ఈ వ్యక్తులు తమతో పాటు అధిష్టాన దేవత త్రిపుర సుందరి విగ్రహం, పూజా సామగ్రిని కూడా తీసుకువచ్చారు. గ్రామంలో అమ్మవారిని ప్రతిష్టించారు. తల్లి త్రిపుర సుందరిని వైష్ణో దేవి సోదరిగా భావిస్తారు. అంతేకాదు మూడు గ్రామాలకు అధిపతి అయిన భేల్ దేవ్ కూడా పూజిస్తారు. కులదేవి, అధిష్టాన దేవత భెల్ దేవ్ హోలీ సందర్భంగా ప్రజల సందడి , రంగులను ఇష్టపడరని ప్రజలు చెబుతారు. అందుకే హోలీని జరుపుకోరు.

ఇది ప్రజల విశ్వాసం

పాతికేళ్ల క్రితం గ్రామంలో హోలీ ఆడినప్పుడు కలరా వంటి వ్యాధుల బారిన పడి చనిపోతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో గ్రామస్తులు ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. క్షేత్రపాలుడు, ఇష్టాదేవి కారణమని, హోలీ ఆడడం వల్లే గ్రామంలో ఇదంతా జరిగిందని తర్వాత వెలుగులోకి వచ్చింది. కొంతమంది దీనిని దేవత తప్పుగా భావిస్తారు.. అయితే చాలా మంది ప్రజలు దీనిని భేల్ దేవ్ తప్పుగా భావిస్తారు. అయితే ఈ గ్రామాల సమీపంలోని గ్రామాల్లో హోలీని పూర్తి వైభవంగా.. రంగులు జల్లుకుంటూ రంగులతో ఆడతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..